ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఏ పీలోని అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రే కదా.
కానీ ఏపీ సీఎం జగన్ అమరావతి ప్రాంతాన్ని టార్గెట్ చేశాడు. ఆ ప్రాంత వినాశనానికి కంకణం కట్టుకున్నాడు.
ఏపీలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అద్రుష్టవ శాత్తూ జగన్ స్వార్థాన్ని జనం పసిగట్టడం వల్ల జగన్ రేపుతున్న చిచ్చు పెద్దగా ఏపీని దహించడం లేదు.
కానీ అమరావతిని ఆపేసి స్థానికులకు గాని ఏపీ ప్రజలకు గాని రావల్సిన అన్ని ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను జగన్ నాశనం చేశారు. ఇది ఎన్నటికీ కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే జగన్ తరిమేసింది పరిశ్రమలను కాదు… ఏపీపై నమ్మకాన్ని చంపేశారు. దీనివల్ల రేపు ముఖ్యమంత్రి మారినా పారిశ్రామిక వేత్తలు ఏపీని నమ్మే అవకాశం లేదు.
ఇక తాజాగా వైసీపీ కొత్త నాటకాన్ని పరిశీలిస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ గర్జన సభ పెట్టారు. ఈ సభ పెట్టే ముందు వైసీపీ కనీస ఆలోచన కూడా చేయలేదు అనిపిస్తుంది. మేధావుల ముసుగులో వైసీపీ పెట్టిన సభ ఇది. లేకపోతే ఒక బహిరంగ సభకు జనాల్ని తరలించేంత శక్తి, డబ్బు మేధావులకు ఉంటుందా? పోనీ సభ పెట్టడానికి డబ్బు ఉంటుందా? మేధావులు సాధారణంగా ప్రెస్ మీట్లు పెడతారు. కానీ ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టారంటే దానివెనుక ఎవరున్నారో అర్థమైపోతుంది.
ఇక ఈ సభ ఎవరు పెట్టారన్నది కాసేపు పక్కన పెడితే… అసలు అన్యాయం జరిగింది ఎవరికి? అన్యాయం చేసింది ఎవరు?
రాయలసీమ మేధావులు అన్న ముసుగు వేసుకొని, వైసీపీ ఎజెండా ను అమలుచేస్తున్నారా?
* కియా అనుబంధ సంస్థలను తరిమేస్తే ఎక్కడున్నారు ?
* రిలయన్స్ జియోని వెనక్కు పంపిస్తే ఎక్కడ ?
* అమర్ రాజాని బెదిరిస్తే ఎక్కడ ?
* హంద్రీ నీవా, గాలేరు నగరి పనులు ఆపేస్తే ఎక్కడ ?
* మెగా సీడ్ పార్క్ రద్దు చేస్తే ఎక్కడ ?
* మన నీళ్ళు తెలంగాణా తీసుకుపోతుంటే ఎక్కడ ?
* వెనుకబడిన జిల్లాల నిధులు దారి మళ్లిస్తే ఎక్కడ ?
* చిత్తూరులో పెద్దిరెడ్డి అరాచకాల పై నోరు తెరవరే ?
* ఎస్సీలు, బీసీలను ఒక కులం అణిచివేస్తుంటే నోరెత్తరే ?
* సాగు నీటి ప్రాజెక్ట్ లు గాలికి వదిలేస్తే ఎక్కడ ?
* అమరావతి-అనంతపురం హైవే రద్దు చేస్తే ఎక్కడ ?
ఇంకో విషయం ఏంటంటే… ఏపీకి గాని ఉమ్మడి ఏపీకి గాని ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు ?
రాయలసీమకి అన్యాయం జరుగుతోందని అధికార వైసిపి తిరుపతిలో 'రాయలసీమ గర్జన సభ' పెట్టింది.
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నాటి వరకు, కోస్తా ప్రాంత ముఖ్యమంత్రులు 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే, రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు 35 ఏళ్లు మాత్రమే పాలించారు. pic.twitter.com/aY8j2nADk5— Ramesh Kandula (@iamkandula) October 29, 2022
అమరావతి రాజధానికి మద్దతుగా తిరుపతిలో చేపట్టిన అఖిలపక్ష సమావేశం
రాయలసీమ నుంచి అధికంగా గల్ఫ్ కు వెళ్తుంటారు ఉపాధి అవకాశాల కోసం.
జగనన్న! రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నది 4 జిరాక్స్ షాపులు కాదు.
కంపెనీలను తీసుకొని వచ్చి తద్వారా ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే ప్రయత్నం చేయండి. ???? pic.twitter.com/r9wTHwFX2N— Keerthana (@Keerthana_JSP) October 29, 2022