ప్రజలనే కాదు, టీడీపీ ని డైవర్ట్ చేయడంలో జగన్ కి తిరుగులేదు
మొన్న జగన్ కుప్పంకి వెళ్లి మాట్లాడుతున్నాడు.
చంద్రబాబు ఈ సీటు బీసీలకు ఇవ్వచ్చు కానీ ఇవ్వడు, తానే పోటీ చేయాలనుకుంటాడు అని చెప్పాడు
మాట్లాడే ముందు చూసుకోవాలి కదా రెడ్డీ
కడప జిల్లాలో 10 సీట్లున్నాయి
అందులో 2 రిజర్వ్ సీట్లు పోను మిగతా 8 సీట్లు ఎవరు పోటీ చేశారో తెలుసుకోవా రెడ్డీ
ఆ ఎనిమిదింటిలో 6 గత ఐదు శతాబ్దాలుగా బీసీలకు, మైనారిటీలకు ఇవ్వకుండా మీరే ఆక్రమించారు కదా రెడ్డీ
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు రెడ్డీ
కడపలో మాత్రం మీ కుటుంబం పోటీ చేయాలి. కానీ వేరే వాళ్ల సీట్లు మాత్రం బీసీలకు ఇవ్వాలి.
అది పక్కన పెట్టినా… తెలుగుదేశం హయాంలో మొత్తం బీసీల చేతిలో ఉన్న టీటీడీ పదవులు వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నీ రెడ్ల చేతుల్లో ఉన్నది నిజం కాదా రెడ్డీ.
ఈ దేశంలో ఎవరికైనా సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కుంది గాని వైఎస్ కుటుంబానికి మాత్రం లేదంటున్నారు కడప జనం. తరతరాలుగా ఎవరికీ ఆ సీట్లు ఇవ్వకుండా కేవలం మీ కుటుంబం చేతిలో ఎలా కబళించి పెట్టుకున్నారో ఈ వీడియోలో చూడండి.