మెగా స్టార్ చిరంజీవి…స్వయంకృషితో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు. విలన్ గా కెరీర్ మొదలుబెట్టి…చిన్నా చితకా వేషాలు సైతం వేసుకుంటున్న చిరంజీవి…ఆ తర్వాత ఇండస్ట్రీలోని అగ్రహీరోలలో ఒకరిగా నిలిచారు. అకుంటిత దీక్ష, మొక్కవోని పట్టుదని, అంకిత భావం వంటి ఎన్నో గుణాలున్న చిరు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడిగా ఎదిగారు. అయితే, అందరివాడిగా పేరున్న చిరంజీవికి కూడా ఇండస్ట్రీలో శత్రువులున్నారన్న సంగతి మాత్రం అతి కొద్దిమందికే తెలుసు.దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం చిరంజీవిని చంపేందుకు విష ప్రయోగం జరిగిందన్న సంగతి బహుశా ఈ తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు.
1988వ సంవత్సరంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ‘మరణమృదంగం’ చిత్రంలో నటిస్తున్నారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఔట్ డోర్లో ఆ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. షూటింగ్ గ్యాప్ లో తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో చిరు మాట్లాడుతున్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఓ వ్యక్తి చిరు అభిమానినంటూ ఆయన ముందుకొచ్చాడు.
ఆ రోజు తన పుట్టినరోజని, చిరు సమక్షంలోనే కేక్ కట్ చేయాలనుకుంటున్నానని చెప్పి హడావిడిగా కేక్ కట్ చేసి చిరు నోట్లో బలవంతంగా పెట్టాలని ప్రయత్నించాడు. అయితే, ఈ అనూహ్య పరిణామానికి షాకైన చిరు అతడ్ని అడ్డుకోవడంతో ఆ కేక్ కింద పడిపోయింది. అప్పటికే కేక్ లో కొంత భాగం ఆయన నోట్లోకి వెళ్లిపోవడంతో ఆయన పెదాలు నీలంగా మారడం మొదలైంది. దీంతో, అనుమానం వచ్చిన చిత్ర యూనిట్ చిరంజీవిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా…ఆయనపై విష ప్రయోగం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. విషానికి విరుగుడు ఇచ్చి చిరంజీవిని కాపాడారు.
అయితే, చిరుపై ఆ విష ప్రయోగం చేయించిందెవరు? కొన్ని పేపర్లలో వచ్చినప్పటికీ మీడియాలో ఆ వార్త పూర్తి స్థాయిలో హైలైట్ కాకుండా చేసిందెవరు? అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, ‘మరణమృదంగం’ చిత్రం నుంచే చిరంజీవికి మెగాస్టార్ బిరుదు రావడం విశేషం. మెగాస్టార్స్ మైటీ మూవీ అని ‘మరణమృదంగం’ చిత్రానికి నిర్మాత కె.యస్.రామారావు పబ్లిసిటీ ఇచ్చారు. ఆ సినపిమా తర్వాత ఆ బిరుదు చిరంజీవి ఇంటిపేరుగా మారిపోయింది. ఆగస్టు 4 నాటికి ఈ సినిమా విడుదలై 34 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

Comments 1