• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత…హీరోయిన్ కాదు విలన్

NA bureau by NA bureau
July 23, 2022
in Movies, Top Stories
0
Samantha fitness

Samantha fitness

0
SHARES
154
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
నాగచైతన్య నుంచి విడాకుల తర్వాత సినిమాల్లో బాగా బిజీ అవ్వాలని చూస్తోంది సమంత. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ‘పుష్ప’ సినిమా కోసం ఆమె హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత విజయ్ దేవరకొండ లాంటి యంగ్ సెన్సేషనల్ హీరోతో ‘ఖుషి’ అనే లవ్ స్టోరీలో నటిస్తోంది. దీని కంటే ముందు ఆమె తమిళంలో ‘కేఆర్కే’ సినిమాలో కొంచెం బోల్డ్‌గా ఉండే పాత్ర  చేసింది.

ఇప్పుడు కోలీవుడ్లోనే సామ్ ఒక సెన్సేషనల్ క్యారెక్టర్‌కు రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సామ్.. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్‌ కొత్త చిత్రంలో నటిస్తుందని ఇప్పటికే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ద్విభాషా చిత్రం ‘వారసుడు’ చేస్తున్న విజయ్.. తర్వాత తనతో మాస్టర్ తీసిన లోకేష్ కనకరాజ్‌తో జట్టు కట్టబోతున్నాడు. ఈ చిత్రంలో సమంత నటిస్తుందని అంటున్నారు.

విజయ్‌తో సమంత ఇప్పటికే కత్తి, తెరి, మెర్శల్ లాంటి బ్లాక్‌బస్టర్లలో నటించింది. దీంతో హిట్ పెయిర్ మరోసారి రిపీటవుతోందని విజయ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఒక ట్విస్టుందంటున్నారు. గత మూడు చిత్రాల్లో మాదిరి ఇందులో విజయ్, సమంత జంటగా కనిపించబోరట. ఇందులో సామ్ కథానాయిక కాదట. తన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని, సినిమాలో విలన్లలో ఒకరిగా తను కనిపిస్తుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే సమంత ఇమేజ్ మారింది. ఆమె కెరీర్లో ఇప్పటిదాకా చేయని తరహా పాత్రల్లో నటిస్తోంది.

ఫ్యామిలీ మ్యాన్-2’లో విలన్ పాత్రతో సామ్ ఎలా అదరగొట్టిందో తెలిసిందే. ఆమెలోని ఈ యాంగిల్‌ను ఇంత కాలం వాడుకోలేకపోయినందుకు ఫిలిం మేకర్స్ చింతించేలా ఆ పాత్రను పోషించింది. ‘విక్రమ్’ మూవీతో ప్రస్తుతం కోలీవుడ్లో నంబర్ వన్ దర్శకుడిగా అవతరించిన లోకేష్.. సామ్ కోసం ఎలాంటి పాత్ర డిజైన్ చేసి ఉంటాడన్నది ఆసక్తికరం. అతడి డైరెక్షన్లో సామ్ నెగెటివ్ రోల్ అంటే చాలా ఎగ్జైటింగ్‌గానే ఉండొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

Tags: heroine samantha ruth prabhumersal combo repeatssamantha and vijay combosamantha as villiansamantha busy with movies
Previous Post

చిరంజీవిపై విష ప్రయోగం..మీడియా మౌనం?

Next Post

జగన్ ను అక్కడ బ్లాక్ చేస్తానంటోన్న చంద్రబాబు

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Andhra

ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?

June 19, 2025
Load More
Next Post

జగన్ ను అక్కడ బ్లాక్ చేస్తానంటోన్న చంద్రబాబు

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra