.@MamataOfficial had written to @ysjagan to come for opp meeting – c sources say he refused to come “Becoz of fear of cbi “ pic.twitter.com/hmihWABOWX
— pallavi ghosh (@_pallavighosh) June 15, 2022
రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే విపక్షాల సమావేశానికి గత వారం బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఏడుగురు ముఖ్యమంత్రు లు సహా మొత్తం 19 రాజకీయ పార్టీలకు ఆమె స్వయంగా లేఖ రాశారు.
జులై 18 జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు, ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని కోరారు. ఈ సమావేశం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే.. మమత తెలంగాణ ముఖ్యమంత్రి కిలేఖ రాసిన విషయం మాత్రమే.. తెరమీదికి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ను విభేదిస్తూ.. ఈ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరయ్యారు.
అయితే.. ఇదేసమయంలో ఏపీ సీఎం జగన్కు కూడా మమత లేఖ రాసిన విషయం.. తాజాగా వెలుగు చూసింది. ఈ లేఖను స్వయంగా సీఎన్ ఎన్ న్యూస్ 18 సీనియర్ ఎడిటర్ పల్లవి ఘోష్ బయట పట్టారు. సీఎం జగన్కు మమతా బెనర్జీ రాసిన లేఖను పల్లవి ఘోష్ తన ట్విట్టర్లో ఉంచారు.
నిజానికి జగన్కు ఎవరైనా లేఖ రాస్తే.. వెంటనే ఈ విషయాన్ని ఆయన సొంత మీడియా సాక్షి వెలుగులోకి తెస్తుంది. “జగన్ను ఆహ్వానించారు. ఆయన ప్రాధాన్యం పెరుగుతోంది. ఆయన పాలనను చూసి.. నాయకత్వ లక్షణాలు చూసి మురిసిపోతు న్నారు“ అంటూ.. భాజా భజంత్రీలు వాయించేస్తుంది.
అయితే.. మమత రాసిన లేఖ విషయంలో మాత్రం తేలు కుట్టిన చందంగా.. వ్యవహరించింది `సాక్షి`. ఎక్కడా చడీ చప్పుడు కూడా వినిపించలేదు. అసలు పల్లవి ఘోష్ బయట పెట్టే వరకు కూడా.. మమతా బెనర్జీ.. సీఎం జగన్కు లేఖ రాశారనే విషయం తెలియక పోవడం గమనార్హం.
ఇదిలావుంటే.. మమత రాసిన లేఖను ఇటు వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాలు దాచిపెట్టడంపై తీవ్రస్తాయిలో చర్చ సాగుతోంది. ఉద్దేశ పూర్వకంగే.. లేఖను దాచిపెట్టారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే లెటర్ గురించి తెలిస్తే.. మమత సహా తమను ఎదిరిస్తున్న పార్టీలు.. శక్తులతో జగన్ టచ్లో ఉన్నాడని.. ప్రధానే మోడీ నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ను తన వాడిగా మోడీ భావిస్తున్నారు. అలా కాదని తెలిస్తే.. జగన్ పుట్టి మునిగిపోవడం ఖాయం. ఇక, అదేసమయంలో తాను స్వయంగా ఇలాంటి సమావేశాలకు హాజరైతే.. మోడీ తనపై సీబీఐ కత్తిని ఝళిపించే ప్రమాదం ఉంటుంది.
ఈ రెండు కారణాలకు తోడు.. లెటర్ విషయం బయటకు వస్తే.. మోడీకి భయపడుతున్నాడు కాబట్టే.. ఈ సమావేశానికి వెళ్లడం లేదనే మరోప్రచారం ఊపందుకుంటుంది. ఇలా.. అనేక కోణాలను దృష్టిలో పెట్టుకునే జగన్ అండ్ కోలు.. ఇలా లేఖను దాచిపెట్టారని అంటున్నారు మేధావులు. మొత్తానికి.. ఎంత దాచినా.. మమత లేఖ బయటకు రావడం వైసీపీకి, ముఖ్యంగా జగన్కు మింగుడు పడని వ్యవహారంగా మారింది. మరి దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.