• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తూము సరళ డెత్ మిస్టరీనే ‘విరాట పర్వం’…సంచలన బయోపిక్

admin by admin
June 15, 2022
in Movies, Top Stories
0
0
SHARES
55
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దగ్గుబాటి రానా, సాయి పల్లవిల కాంబోలో వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా, సాయిపల్లవి, చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాలో మావోయిస్టు ‘వెన్నెల’ పాత్రలో కనిపించిన సాయి పల్లవి గ్రామీణ నేపథ్యంలో పెరిగి ఉద్యమం పట్ల ఆకర్షితురాలైన అమ్మాయిగా కనిపించబోతోంది. అయితే, సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర…నిజ జీవితంలో దివంగత మావోయిస్టు తూము సరళ జీవితం ఆధారంగా తీర్చిదిద్దారు. దీంతో, అసలు తూము సరళ ఎవరు? ఆమె నిజ జీవిత కథ ఏంటి అన్న చర్చ జరుగుతోంది.

వరంగల్ లో విప్లవ భావాలున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సరళ 16 ఏళ్ల వయసులోనే ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. తుపాకీ పడితేనే న్యాయం జరుగుతుందనే విప్లవభావాలు ఇంటర్ చదివే రోజుల్లోనే ఆమెలో బలంగా నాటుకుని పోయాయి. దీంతో, డాక్టర్ కావాలని ఇంటర్‌ బైపీసీలో చేరిన సరళ…ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయకుండానే విప్లవంలో చేరింది. చివరకు అనూహ్య పరిస్థితుల్లో దళ సభ్యుల చేతుల్లోనే దారుణంగా చనిపోయింది.

తన చెల్లెలు సరళ డెత్ మిస్టరీ గురించి ఆమె అన్నయ్య మోహన్ రావు కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉద్యమంలో ఉన్న సరళ దళ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక పోయిందో, లేదంటే ఇంకేదైనా అయ్యిందో తనకు తెలియదని మోహన్ చెప్పారు. అయితే, సరళపై అనుమానం వచ్చిన దళ సభ్యులు ఆమెను పోలీస్ ఇన్ఫార్మర్ గా భావించారని, అందుకే, కొట్టి టార్చర్ చేసి చంపేశారని ఆరోపించారు.

వాళ్లు కొట్టిన దెబ్బలకు చనిపోవడంతో ఆ దళ సభ్యులే శవాన్ని దహనం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె చనిపోయినట్లు పేపర్‌ లో దళ సభ్యులు ప్రకటన విడుదల చేశారని, అప్పుడే ఆమె చనిపోయినట్లు తమకు తెలిసిందని అన్నారు. తన తండ్రి కూడా విప్లవ భావాలున్న వ్యక్తి అని, తన చెల్లెలిపై అనుమానం వచ్చాక ఉద్యమం నుంచి వెనక్కి పంపించేసి ఉండొచ్చని, విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకొని ఉంటే తన చెల్లెలు బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సరళ విషయంలో పొరపాటు జరిగిందని చెప్పారని, కానీ.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయిందని షాకింగ్ విషయాలను బయట పెట్టారు.

Tags: late maoist tumu saralarana daggubatisai pallavi as tumu saralashocking factstumu sarala's death mysteryvirataparvam movie
Previous Post

జగన్ పై చంద్రబాబు భీష్మ ప్ర‌తిజ్ఞ…ఉరితాడు రెడీ

Next Post

అమ్మ దొంగా… మమత లేఖను దాచిపెట్టిన జ‌గ‌న్‌, తేలుకుట్టిన దొంగలా సాక్షి

Related Posts

Andhra

టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!

March 28, 2023
Trending

అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్

March 28, 2023
Trending

అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?

March 28, 2023
Top Stories

తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్

March 28, 2023
Trending

వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్

March 28, 2023
Trending

లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!

March 28, 2023
Load More
Next Post

అమ్మ దొంగా... మమత లేఖను దాచిపెట్టిన జ‌గ‌న్‌, తేలుకుట్టిన దొంగలా సాక్షి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్
  • ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!
  • రాపాక నీతులు చెప్ప‌డం ఏంటి బ్రో!!
  • వివేకా కేసు విచారణపై సుప్రీం సంచలన నిర్ణయం
  • జనసైనికుల ‘దమ్ము’పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
  • సజ్జలకు జగన్ చెక్..ఇదే ప్రూఫ్?
  • ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra