వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరుతున్నా అని చెప్పిన జగన్…లండన్ లో ల్యాండ్ కావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రయాణిస్తున్న ఖరీదైన ప్రైవేట్ విమానం అంతకంటే ఖరీదైన ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడం దుమారం రేపింది. అయితే, ఫ్లైట్ కు పర్మిషన్ లేక లండన్ లో దిగాల్సి వచ్చిందంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన వివరణ సిట్యువేషన్ కు ఏమాత్రం సింక్ కాలేదు.
దీంతో, బుగ్గన ఇచ్చిన వివరణకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుగ్గన చెప్పినవన్నీ అసత్యాలేనని, ఆ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడని అన్నారు. జ్యూరిక్ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, జ్యూరిక్ దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఈ 190 ఫ్లైట్ వస్తుందని సమాచారమిచ్చారని ఆధారాలతో సహా బయటపెట్టారు.
ఇది ముందే ఫిక్స్ అయిన ప్రీ ప్లాన్డ్ టూర్ అని, మే 17నే దీనికి సంబంధించిన సమాచారం ఆయా విమానాశ్రయాల దగ్గర ఉందని గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డిపై కూడా అయ్యన్న మండిపడ్డారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ రెడ్డి ఏం మొహం పెట్టుకొని దావోస్ వెళ్ళారని అయ్యన్న నిలదీశారు. సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్ కి వెళ్లిన జగన్ పై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు, లోకేష్ ల దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో నువ్వు ఓపికగా లెక్కేసుకో విజయసాయి రెడ్డి, ఫ్రీగా కాలిక్యులేటర్ పంపుతాంమంటూ చురకలంటించారు. టీడీపీ హయాంలో భారీ, మధ్య, చిన్న తరహా కలిపి 39450 పరిశ్రమలు, 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గణాంకాలతో సహా ప్రకటించిందని గుర్తు చేశారు. బహుశా విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి ప్రభుత్వం ప్రకటించిన ఆ గణాంకాలు చూడలేదేమోనని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక విమానంలో వెళ్ళిన జగన్ రెడ్డి సంగతి తేల్చు విజయసాయిరెడ్డి అంటూ అయ్యన్న పంచ్ లు వేశారు. టీడీపీ నేతల సంగతి మూడేళ్ల నుంచి తేలుస్తూనే ఉన్నారని, ఏం పీకారో జనాలు కూడా చూసారని అన్నారు.