రైతు ఒక ఎమోషన్
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా.
గత ఏడాది రైతులను హింసించి వారి ఉసురుపోసుకున్నారు మోడీ.
అందరి మెడలు వంచగలిగారు… రాజు లాంటి రైతును మాత్రం ఏమీ చేయలేక వ్యవసాయబిల్లులు రద్దు చేశారు.
సరిగ్గా ఆ పాయింట్ మీదే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ తెలంగాన టూర్ నడిచింది.
వరంగల్ కాంగ్రెస్ సభ కాస్తా… తెలంగాణ రైతు సభగా మారింది.
అక్కడికి పెద్ద సంఖ్యలో అనూహ్యంగా తరలివచ్చిన జనాలతో కాంగ్రెస్ నేతల్లోను కొత్త ఉత్సాహం వచ్చింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ రైతులకు ఊహించని వరం ప్రకటించింది.
రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ ప్రకటించింది.
ఇది ఎవరూ ఊహించనిది. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.
ఇంకా ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ అంటూ కొత్త సంచలన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఈ సందర్భంగా రాహుల్ ఏమన్నారంటే…
తెలంగాణ వల్ల ఒకే కుటుంబం బాగుపడింది. అది కేసీఆర్ ఫ్యామిలీ. తెలంగాణ ఏ ఒక్కరి వల్లో రాలేదు, తెలంగాణ ఏ ఒక్కరి కోసమూ కాదు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అది అందరిదీ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఎవరు బాగుపడతారని తెలంగాణ ఇచ్చామో వారు బాగుపడలేదు అన్నారు.
తెలంగాణ ఇస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నాం. ఈ సీఎం ఒక రాజులా నియంతలా మారిపోయారు. పేరుకే ఆయన ముఖ్యమంత్రి… రాష్ట్రంలో నడుస్తున్నది రాజరికం.. అని రాహుల్ విమర్శలు చేశారు.
తెలంగాణ ధరిత్రి పై చరిత్ర సృష్టించే రైతు సభ!
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ అబద్ధపు, అన్యాయపు పాలనలో ఆగమైపోయిన తెలంగాణ రైతాంగానికి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “రైతు సంఘర్షణ సభ” తిరుగులేని భరోసా.#RaithuSangharshanaSabha pic.twitter.com/CEB3WthXmI
— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022
వరంగల్ డిక్లరేషన్ అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించిన దాంట్లో పెద్ద వరాలే ఉన్నాయి.
రైతులకు 2 లక్షల రుణ మాఫీ.
ఎకరానికి పెట్టుబడి సాయం 15వేలకు పెంపు
కౌలు రైతులకు కూడా ఎకరానికి 12 వేల పెట్టుబడి సాయం.
పోడు రైతులకు పట్టాలు
పుసుపు బోర్డు ఏర్పాటు
ఇకపై అన్ని పంటలే కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది.
https://twitter.com/revanth_anumula/status/1522618377340030977