YCP Govt is not even sparing kids. Sad.. https://t.co/qXkZD9tBjc
— Pawan Kalyan (@PawanKalyan) April 27, 2022
పల్నాడులో అధికార పార్టీ క్యాడర్ వేసిన పోస్టర్లను చింపివేశారనే ఆరోపణలపై పల్నాడులో ముగ్గురు పాఠశాల విద్యార్థులను నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్ని పార్టీలు వైసీపీ ప్రభుత్వ పెద్దల వైఖరిపై మండిపడ్డాయి.
వైసీపీకి చెందిన ఫ్లెక్సీలను కొందరు చిన్నారులు చింపేశారు. వాళ్లు అమాయకత్వంతో చేసిన పని. పోలీసులు వారిపైకి మైనర్లపైకి దూసుకెళ్లి, వారిని పట్టుకుని, కొన్ని గంటలపాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు అంటూ స్థానిక జాతీయ మీడియాలో ఈ వార్త ప్రసారం అయ్యింది.
ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “వైసీపీ ప్రభుత్వం పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు. విచారకరం” అని అన్నారు.
వారు పోస్టర్లు చించినంత మాత్రాన వైసీపీ సర్కారు కూలిపోతుందా… మైనర్లను స్టేషనుకు తీసుకెళ్లేంత నీచానికి దిగజారుతారా అంటూ పవన్ మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలోని జానపాడులో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉండగా పొరపాటున వైసిపి ఫ్లెక్సీ కొంచెం చిరిగిందని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు
కిమ్ జాంగ్ ప్రభుత్వంలో కూడా ఇంత అరాచకం ఉండదేమో….!!
ముసలి వారి దగ్గర నుండి చిన్న పిల్లల వరకు ఎవర్ని వదలని ఓ సైకో పాలన ఇది pic.twitter.com/5l3W5msEc7
— Vikas Kanumuri (@KanumuriVikas) April 26, 2022