నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాల ఫైలును దొంగిలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే, ఈ చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత ఎస్పీ విజయరావు మీడియాకు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఆ ఇద్దరు పాత నేరస్తులని, వారిపై అనేక చోరీ కేసులున్నాయని, కోర్టులో ఇనుము దొంగతనం చేయడానికి వెళ్లి కుక్కలు అరవడంతో భయపడి కోర్టు భవనంలో ఓ గది తాళం పగులగొట్టి దాంట్లోకి ప్రవేశించారని వెల్లడించారు. ఆ గదిలోని ఓ బీరువా ఓపెన్ చేసి అందులోని బ్లూ కలర్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయారని వివరించారు.
ఈ క్రమంలోనే ఎస్పీ ఇచ్చిన వివరణపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ‘‘ వాళ్ళు వెళ్ళింది ఐరన్ దొంగతనం చేయటానికి.. కానీ అక్కడ కుక్కలు మొరిగాయి…అందుకే దొంగలు భయ పడ్డారు…కోర్టు రూమ్ లోకెళ్లి తాళం పగలగొట్టారు…కేవలం కాకాని ఆధారాలు మాత్రమే పట్టుకుని వచ్చేసారు…. ఎస్పీ గారు ఏమి స్టొరీ చెప్పారు… ఐరన్ దొంగలు – కుక్కలు – బ్యాగు… కధ బలే ఉంది కదా ’’అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.
కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగిలించడం దారుణమని, సీఎం జగన్ కేసుల్లో కూడా ఇలా సాక్ష్యాలను ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సాక్ష్యాలకు సీబీఐ వాళ్లు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని, వివేకా హత్య కేసులోని ఆధారాలకు కూడా భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ కుల పార్టీనా? టీడీపీ కుల పార్టీనా? అనే విషయం తేల్చుకుందాం రా అంటూ విజయసాయికి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.
ఉత్తరాంధ్రకు నిన్ను జగన్ ఇన్ఛార్జీని చేశారని, తనను చంద్రబాబు ఇన్ఛార్జీని చేశారని… ఎవరిది కుల పార్టీ అని ప్రశ్నించారు. కులాన్ని చూసుకున్నది ఎవరని నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడిన వీడియోను కూడా వెంకన్న ట్విటర్ లో షేర్ చేశారు.
ఎస్పీ గారు ఏమి స్టొరీ చెప్పారు
వాళ్ళు వెళ్ళింది ఐరన్ దొంగతనం చేయటానికి..
కానీ అక్కడ కుక్కలు మొరిగాయి.
అందుకే దొంగలు భయ పడ్డారు.
కోర్టు రూమ్ పగలగొట్టారు.
కేవలం కాకాని ఆధారాలు మాత్రమే పట్టుకుని వచ్చేసారు.ఐరన్ దొంగలు – కుక్కలు – బ్యాగు… కధ బలే ఉంది కదా.. #CourtDongaKakani pic.twitter.com/xbQkY8pnGY
— Budda Venkanna (@BuddaVenkanna) April 17, 2022