దునియా మొత్తం ఓలెక్క ఒక్క పంజాబ్ లోనే ఓ లెక్క అన్న విధంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కి ఇప్పుడు నూతనోత్సాహం వచ్చేసింది. మామూలుగా కాదు అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్య మాదిరిగా కేజ్రీ ఆనందంతో ఊగిపోతున్నారు. కాంగ్రెస్ కే కాదు బలీయమయిన బీజేపీకి కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతుండడం ఇవాళ కేజ్రీ అనే నేత సాధించిన గొప్ప విజయం.ఈ విజయాలకు కొనసాగింపుగా కేజ్రీ వాల్ పనిచేయాలి. ఆయన అనుచరులు కూడా పనిచేస్తే మేలు.
ఇప్పటికే దేశాన్ని శాసిస్తున్న శక్తులుగా ఉన్న బీజేపీ మరియు ఇతర పార్టీలకు మరింత వెన్నుదన్నుగా కార్పొరేట్ సంస్థలు నిలుస్తున్నాయన్న వాదన ఉంది.దీనిని తొలగిస్తూ నిలిపేస్తూ ప్రతిష్టంభన నెలకొనేలా చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేయాలి. పంజాబ్ ఫలితాల నేపథ్యంలో మరింతగా పనిచేస్తే మోడీకి ఓ ప్రత్యామ్నాయ నేత కేజ్రీ కావడం ఖాయం. మాస్ పల్స్ తెలిసిన నేతగా మోడీ కన్నా ఎక్కువ పేరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది.ముఖ్యంగా నోరు తూలని మాట జారని వ్యక్తిగా కేజ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. విద్యారంగం విషయంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రభుత్వ బడులను బాగు చేయించిన పద్ధతి, అక్కడ చదువులు చెప్పిస్తున్న విధానం యావత్ దేశానికే ఆదర్శం.అలానే ఆయన మ్యానిఫెస్టోలో కూడా జగన్ ప్రకటించినన్ని ఉచిత పథకాలు లేవు.
అది కూడా ఓ వరమే! ఎందుకంటే ఆర్థిక భారం లేకుండా ఓ ప్రభుత్వ వ్యవస్థ నడవడం కానీ నడపడం కానీ ఓ పెద్ద సవాల్ ఇవాళ. అయినా కూడా కేజ్రీ మంచి విజయాలు నమోదు చేశారంటే ముఖ్యంగా రైతు పక్షపాతిగా ఆయనకు పేరుండడం.నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మోడీ హవాకు వ్యతిరేకంగా సాహసోపేతంగా పనిచేయడం..ఇవే ఆయనకు మంచి ఆయుధాలుగా నిలిచాయి.ఇవే ఆయనకు మంచి పేరు యశస్సు మరియు కీర్తీ తెచ్చి పెట్టి విజయావకాశాలను షురూచేశాయి. డ్రగ్స్ హబ్ గా మారిని ‘ఉడ్తా పంజాబ్’ ను కేజ్రీవాల్, పంజాబ్ కు కాబోయే సీఎం భగవంత్ ఊడ్చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.