పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవగాహన రాహిత్యాన్ని తనే బయటపెట్టుకుంటున్నట్లు ఆయన తాజా కామెంట్స్ బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు మాకు పాత జీతాలు కావాలని కొత్త పీఆర్సీ వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ పార్టీ నేతల దుష్ప్రచారాన్ని ముందే పసిగట్టిన నేతలు… ముందుజాగ్రత్త పడ్డారు. అందులో భాగంగా రాజకీయ పార్టీలు తమ పోరాటంలో కలిస్తే దీనికి మసిపూసి మారేడు కాయ చేసి ఉద్యోగులను చీలుస్తారని గ్రహించి రాజకీయ పార్టీల మద్దతును వద్దన్నారు.
అంటే దానర్థం మాకు మీ నాయకత్వం అవసరం లేదు, మీ సభలు అవసరం లేదు, మా అవసరాలు మేం చూసుకుంటాం అని, మీతో కలిసి ధర్నా చేయడం ఇష్టం లేదు అని మాత్రమే.
అంతే గాని మీ మద్దతు ఇవ్వద్దు అని కాదు. మీరిచ్చుకోండి మాకు అవసరం లేదు అని. కానీ పవన్ కళ్యాణ్ వాళ్లు వద్దన్నారు కదా అని పార్టీ తరఫున ఏమీ స్పందించలేదు. చివరకు కనీవినీ ఎరుగని మహా నిరసన చూసి విస్మయం చెందిన పవన్ ఇపుడు మాట్లాడక పోతే ఉద్యోగులకు దూరమవుతాం అని వెంటే సీన్లోకి వచ్చాడు.
పైగా ఉద్యోగులు వద్దన్నా మొదట్నుంచి ఉద్యోగుల విషయంలో టీడీపీ తన వాయిస్ వినిపిస్తుండటం, అనూహ్య సంఖ్యలో ఉద్యోగులు ఎదురుతిరగడంతో పవన్ మేల్కొన్ని స్పందించారు. ఆయన స్పందన ఇక్కడ వినొచ్చు.