జగన్ కంటికి కునుకు లేకుండా విమర్శలు చేస్తున్న రఘురామరాజుకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. పార్లమెంటరీ బిజినెస్ పత్రిక పార్లమెంటేరియన్స్ కి ఇచ్చిన ర్యాంకుల్లో నరసాపురం ఎంపీ రఘురామరాజు మాత్రం 40వ స్థానంలో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఓవరాల్ ఫర్ ఫామెన్స్ లో రఘురామరాజు మెరుగైన పనితీరు కనబరచగా మిగతా వైసీపీ ఎంపీలు మొత్తం వెనుకపడ్డారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి 187 ర్యాంకింగ్ లో నిలబడ్డారు. జగన్ కి ఇష్టమైన నందిగం సురేష్ 379 ర్యాంకింగ్ తో పేలవమైన ఫర్ ఫామెన్స్ కనబరిచారు. ఇతని ర్యాంక్ లోక్ సభ విభాగంలో చూసినపుడు 427 వ స్థానంలో ఉండటం గమనార్హం. రఘురామరాజు గతంలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని చేపట్టిన మచిలిపట్నం ఎంపీ బాలశౌరి వల్లభనేని స్తానం కూడా దారుణంగా ఉంది. అతను 237వ ర్యాంక్ లో ఉన్నారు.
జగన్ గాలిలో గెలవడమే గాని వైసీపీ ఎంపీల్లో అత్యధికులకు లోక్ సభ వ్యవహారాలపై పరిజ్జానం తక్కువే. తనకు తలకు ఎగరేయకుండా ఉండాలన్న ఏకైక కాంక్షతో జగన్ అనామకులకు టికెట్స్ ఇచ్చారు. వేవ్ లో అందరూ గెలిచేశారు. కానీ వారి పనితీరు సరిగా లేక నియోజకవర్గ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. తమ లోక్ సభ నియోజకవర్గానికి సాధించుకోవాల్సిన హక్కులు, నిధుల విషయాల్లో ఫెయిలవడంతో ఆయా నియోజకవర్గాల ప్రజల నష్టపోతున్నారు. అదే అనుభవజ్జులు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.
తెలుగుదేశం ఎంపీలు మంచి స్థానాలు సాధించడం ఇక్కడ కొసమెరుపు. గల్లా జయదేవ్ 55వ స్థానంలో నిలవగా, ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు 81 స్థానం దక్కించుకోవడం విశేషం.