ఈ మధ్య పవన్ కళ్యాణ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
ఆయన మునుపటి మనిషిలా లేరు.
అభిమానులకు సంబంధించి ఆయన తీరు చాలా మారింది.
అభిమానుల వల్ల ఆయన తిట్లు తినడం పరిపాటి అయ్యింది.
కానీ పోసాని ఎపిసోడ్లో పవన్ ఇంటిదాకా వచ్చాయి ఆ తిట్లు.
ఆ తర్వాత పవన్ కామెంట్లు గమనిస్తే అభిమానుల తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది.
తాజాగా ఆయన చేసిన కామెంట్లు మరోసారి పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది.
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో, కొంతమంది అభిమానులు ‘పవర్‌స్టార్’ నినాదాలు చేశారు. ఇది అతనికి చికాకు కలిగించింది.
“అరవడం ఆపు. నన్ను పవర్‌స్టార్ అని పిలవకండి. మీ మెదడును కొంచెం పెంచుకోండి. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి సహకరించండి. మనుషులు చచ్చిపోతుంటే ఎలా నవ్వుతారు?’’ అంటూ అభిమానులపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
ఇదే అంశంపై అభిమానులపై పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇలా అన్నారు.
“మీరు నా కోసం అరుస్తారు. నా సమావేశాలకు వస్తారు. కానీ జగన్‌కు ఓటు వేస్తారు‘‘ అని సెటైర్ కూడా వేశారు.
దీనిపై సోషల్ మీడియాలో కొత్త వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్పందన అభిమానులను అవమానిస్తూ, పవన్ తనను తాను అవమానించుకున్నట్టుంది అంటున్నారు.
నిజానికి అభిమానులను క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఆ ఫలితాలను ఇవ్వడం లేదు. పైగా పవన్ ప్రత్యర్థులకు అవి సోషల్ మీడియాలో మెటీరియల్‌గా మారుతున్నాయి.
రాజకీయ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి, పవన్ అభిమానుల బల హీనతలను వదిలేసి వారి బలం మాత్రమే గుర్తించాలి. వారిని వేరే మార్గాల్లో వారిని క్రమశిక్షణలో పెట్టే మార్గాలను పవన్ అన్వేషించాలి.