పరిటాల కుటుంబం అంటేనే రాయలసీమ పౌరుషం
ఎంత మంది ఫ్యాక్షనిస్టులు ఉన్నా పరిటాల రవి బతికినంత కాలం కింగ్ లాగే బతికాడు.
రవి మీద కత్తి వేటు వేయడానికి రాష్ట్ర స్థాయిలో అధికార, ఆర్థిక, రాజకీయ బలం ఉపయోగించక తప్పలేదు.
అయితే, రవి లేకపోయినా ఆయనకు సరైన వారసత్వమే మిగిలింది. ఎదుగుతన్న సమయంలో ప్రతిపక్షంలో ఉండటం పరిటాలా శ్రీరామ్ మరింత రాటుదేలడానికి అవకాశం వచ్చినట్లు అయ్యింది.
పరిటాల శ్రీరామ్ చిన్నవాడు కావడంతో పరిటాల వారసత్వాన్ని భార్య సునీత చేపట్టింది.
కానీ ఆమె ఏనాడూ పరుష వ్యాఖ్యలు పెద్దగా చేసేది కాదు. మంత్రిగా ఉన్నపుడు కూడా తన ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. జరిగిందేదో జరిగిపోయింది… అని ప్రశాంతమైన రాజకీయాలకే అలవాటు పడ్డారు.
కానీ మొదటి సారి ఆమెలో పరిటాల రవి కనిపించారు.
ఆ మాటల్లో పరిటాల రవి ఉంటే ఎలా ఉండేదో కనిపించింది.
6 నిమిషాల పాటు చేసిన ఆమె ప్రసంగం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇది కదా మాకు కావల్సింది
ఇదే మాకు కావల్సింది
అంటూ టీడీపీ శ్రేణులు ఊగిపోయారు.
ఆమె మాటల్లో హైలెట్ ఏంటో తెలుసా… 2024 దాకా అక్కర్లేదు… ఇపుడు కూడా చంద్రబాబు కనుక సైలెంట్ గా ఉంటే ప్రతిపక్షంలో ఉంటూనే వైసీపీకి చుక్కలు చూపిస్తాం అన్నట్టు ఆమె చేసిన వ్యాఖ్య టీడీపీ నేతలకు కొత్త బూస్ట్. ఆమె ప్రసంగాన్ని చదవడం కంటే వినడమే బాగుంటుంది.
అందుకే ఆమె ప్రసంగం 6 నిమిషాల వీడియోలో కింద చూడొచ్చు.