సూపర్ హాట్ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో తన కలలను సాకారం చేసుకోవడానికి టాలీవుడ్‌ని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అందుకే ఆమె తెలుగులో తక్కువ సినిమాలు చేస్తోంది. అయితే, ఆమెకు ఇక్కడ అవకాశాలు కూడా తగ్గాయిలే అని కొందరు విమర్శిస్తున్నారు.
ఇది పక్కన పెడితే చాలా జాగ్రత్తగా కెరియర్ ను, వ్యాపారాన్ని లైఫ్ ను ప్లాన్ చేసుకుంది రకుల్ సింగ్. ఇప్పటికే తెలుగులో పెద్ద స్టార్లతో చేసిన రకుల్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా బానే సినిమాలు చేసింది. ఇక లైఫ్ లో కీలకమైన దశలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు రకుల్ ప్రకటించింది.
ఈరోజు రకుల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో 31 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన ఈ నటి తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. హీరో జాకీ భగ్నాని తన నిజమైన ప్రేమ అని ఆమె వెల్లడించింది.
“థాంక్యూయూ మై లవ్! మీరు ఈ సంవత్సరం నువ్వు నాకు దొరికిన అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు ధన్యవాదాలు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు‘‘ అంటూ జాకీ భగ్నానితో కలిసి ఉన్న ఫొటో పోస్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
విదేశాలలో ఒక పార్కులో నడుస్తున్నట్లు దిగిన ఈ ఫొటోతో అనేక రూమర్లకు రకుల్ చెక్ పెట్టింది. ప్రముఖ నిర్మాత వషు భగ్నాని కుమారుడు జాకీ. ఆయన నటుడు నిర్మాత.
అతను రంగ్రేజ్ మరియు మోహిని వంటి చిత్రాలలో నటించారు. తాజాగా కూలీ నం 1 మరియు బెల్ బాటమ్ వంటి సినిమాలు నిర్మించాడు.
బాలీవుడ్ కథానాయికలు స్టార్ హీరోలతో ప్రేమలో పడటం అనేది ఎల్లప్పుడూ జరిగేదే. బోనీ కపూర్-శ్రీదేవి, సోనాలి బింద్రే-గోల్డీ బెహల్, రవీనా టాండన్-అనిల్ తడాని… తాజాగా రకుల్-జాకీ జంట.