మీడియా పని,
ప్రతిపక్షాల పని
ప్రభుత్వాన్ని విమర్శించడమే
అలా చేయకపోతేనే అవి తప్పు చేసినట్లు.
కానీ దీనిని కూడా తనకు అనుకూలంగా చేసుకోవాలని జగన్ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ బ్యాచ్ పై, వారి క్రెడిబులిటీపై సంచలన కామెంట్లు చేశారు.
ఏపీలో రోడ్ల పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ విషయంపై ప్రతిపక్షాలు మీడియా గోలపెడితే వారినే తప్పు పట్టే ప్రయత్నం చేశారు జగన్ రెడ్డి.
అది ఫలించదు అని అర్థమైంది. దీంతో వర్షాలు ఆగిపోయాక రోడ్లు వేస్తాం అని హామీ ఇచ్చి తాత్కాలికంగా తప్పించుకున్నారు.
ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్…
ప్రభుత్వం రోడ్లు వేయడానికి టెండర్లు పిలుద్దామని తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టిందట.
అయితే, ఏ కాంట్రాక్టరు కూడా మీ టెండరు వద్దు, డబ్బుల కోసం మీ వెనుక తిరగడమూ వద్దు అంటూ చేతులు ఎత్తేశారట.
దీనిపై ఉండవల్లి స్పందించిన వైనం వైరల్ అయ్యింది. … ఇదిగో ఇక్కడ చూడండి.