ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరీ హింస బీజేపీకి భారీగా డ్యామేజ్ చేస్తోంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం ఉద్దేశ పూర్వకంగా రైతులను తొక్కించి చంపారన్న వివాదం ఉత్తర భారతాన్ని కుదిపేస్తోంది.
ఈ నేపథ్యంలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ను ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద అక్టోబర్ 3 న జరిగిన సంఘటనకు సంబంధించి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆశిష్ మిశ్రాకు నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అసలు వ్యవహారం గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుందాం.
హోం మంత్రి (ఇండిపెండెంట్) అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ప్రశ్నించాలని పోలీసులు మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అతనిపై సోమవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. పోలీసులు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆశిష్ మిశ్రా ను విచారణకు పిలుస్తూ కేంద్ర మంత్రి ఇంటి వెలుపల నోటీసును అతికించారు.
ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.వారు లవ్ కుష్ మరియు ఆశిష్ పాండే. ఇద్దరూ ఒకే వాహనంలో ఉన్నారని, జర్నలిస్ట్ మరియు రైతుల మీదుగా వాహనం దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకీ గుళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది సభ్యుల యుపి పోలీసు బృందం లఖింపూర్ ఖేరీ హింసపై దర్యాప్తు చేస్తుంది.
“ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేయబడ్డాయి మరియు వీలైనంత త్వరగా విచారణకు రావాలని కోరారు మరియు అతనిపై మరిన్ని చర్యలు తీసుకోబడతాయి” అని లక్నో జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ లక్ష్మీ సింగ్ మీడియాకి చెప్పారు. ఈ కేసులో అరెస్టులు మరియు చర్యల గురించి సుప్రీంకోర్టు యుపి సర్కారుని ని అడిగిన తర్వాతే దర్యాప్తు మొదలైంది.
లఖింపూర్ ఖేరీలో ఈవెంట్లకు సంబంధించిన పిటిషన్పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఈ రోజు “ఎంత మందిని అరెస్టు చేశారు” అని ప్రశ్నించింది. రేపటిలోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
“మీరు ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారో మరియు ఎంతమందిని అరెస్టు చేశారో మాకు తెలియాలి” అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. స్టేటస్ రిపోర్టులో ఎనిమిది మంది మరణించిన వారి వివరాలను కూడా చేర్చాల్సి ఉంటుందని చెప్పింది.
మంత్రి కుటుంబానికి చెందిన ఎస్యూవీ వాహనం ఆదివారం నిరసనకారుల బృందంలోకి దూసుకెళ్లిన వీడియో ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేసింది.
ఆ తర్వాత జరిగిన హింస మరియు కాల్పుల్లో, మరో నలుగురు – ఒక జర్నలిస్ట్, ఇద్దరు బిజెపి కార్యకర్తలు మరియు ఒక డ్రైవర్ – మరణించారు.
రైతులు మరియు పాత్రికేయులు మరణించిన ప్రదేశం నుండి రెండు తుపాకి గుళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆశిష్ మిశ్రా తుపాకీ పేల్చాడని రైతులు ఆరోపించారు. అయితే పోస్ట్మార్టం నివేదికలను ఉటంకిస్తూ పోలీసులు తుపాకీ కాల్పుల గాయం ఎవరి శవంపై లేవని చెప్పారు.
ఎస్యువి తన కుటుంబానికి చెందినదని చెప్పిన మంత్రి తన కొడుకు మాత్రం అందులో లేడని చెప్పడం గమనార్హం.
This is Ashish Mishra Teni, Son of MOS Home Ajay Mishra Teni running from the crime scene where he mowed down dozens of farmers. Locals have confirmed it. There are eyewitnesses. Administration is pressurising family of the deceased to cremate the dead without proper Postmortem. pic.twitter.com/dBFAIi73Yz
— Rinkiya Ke Papi ⚽ ????????❤️????????❤️???????? (@RinkiyaKePapi) October 5, 2021