- గాడ్సేను పూజించే పార్టీతో పవన్ పొత్తు:గ్రంధి శ్రీనివాస్
- పవన్ కు అలా చేసే దమ్ముందా? మంత్రి బాలినేని సవాల్
- కరోనా టైంలో వేలాది మందితో పవన్ సభ పెడతారా?:సజ్జల
- పవన్ కల్యాణ్ కు మంత్రి బాలినేని బస్తీమే సవాల్
పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల మాటల దాడి కొనసాగుతూనే ఉంది. పవన్ ని పట్టించుకోనవసరం లేదంటూనే మొత్తం ఫోకసంతా పవన్ పైనే పెట్టింది వైసీపీ.
తాజాగా పవన్ తూర్పుగోదావరి పర్యటన నేపథ్యంలో పవన్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బాలినేని, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. పవన్ ఏం నిరూపించాలనుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదని సజ్జల అన్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వేలాదిమందితో సభ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
కరోనా నేపథ్యంలో ప్రజారోరోగ్యం కోసమే సభపై ఆంక్షలు విధించామని, సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో అందరికీ తెలుసని అన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు కేటాయించామని, నవంబర్ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని బాలినేని సవాల్ విసిరారు. బాలినేని మళ్లీ వైసీపీ మార్క్ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ టీడీపీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.
పవన్ వ్యాఖ్యల వల్ల ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. సమాజంలో విద్రోహ శక్తులను ప్రోత్సహించేలా పవన్ వ్యాఖ్యలున్నాయని దుయ్యబట్టారు. గాడ్సేను పూజిస్తున్న పార్టీలతో పవన్ పొత్తుపెట్టుకుని గాంధీ శాంతియుత మార్గాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వలాభం కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అయినా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన వైసీపీ అబద్ధాలుచెప్పక నిజాలు చెబుతుందా? అని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.