మాంసారాల్లో ఎన్ని ఉన్నా ఎక్కువగా చికెన్నే ఇష్టపడి తింటారు. మిగతా వాటితో పొల్చుకుంటే చికెన్ ధర కూడా తక్కువే. వీకెండ్ వస్తే మూడు పూటల బిర్యానీ లాగించేవారున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు రెస్టారెంట్, హోటల్స్ రకరకాలు వైరటీలు అందిస్తూ చికెన్ ప్రియుల మనసు దోచుకుంటూ ఉంటాయి.
చికెన్లో ఎన్ని వైరెటీలు ఉన్న చికెన్ బిర్యానీ ప్రత్యేక వేరు. బిర్యానీ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఇక్కడి బిర్యానీపై మనసు పారేసుకుంటుంటారు.
హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు బిర్యానీ తినకుండా ఉండలేరు. హైదరాబాద్లోనే కాకుండా పలు ప్రాంతాల్లో బిర్యానీని రకరకాలు ప్రత్యేకతలతో చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. ఆయా ప్రాంత సంప్రదాయాలను అనుగుణంగా బిర్యానీ తయారు చేస్తున్నారు.
అయితే, కోట్ల మంది మనసు దోచిన బిర్యానీ ఇంట్లో చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ఎక్కువ మందికి హోటల్ బిర్యానీయే ఇష్టం. అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ చేదు వార్త.. ఇటీవల చికెన్ బిర్యానీ అందులో వాడుతున్న పదార్థాలపై ఆరోగ్య నిపుణులు పరిశోధన చేశారు. ఈ పరిశోధనల్లో భయంకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా బిర్యానీ ప్రియులకు నిపుణులు ఓ హెచ్చరిక జారీ చేస్తున్నారు. బిర్యానీలో హోటల్స్ లో వాడే పదార్థాలు అంత ఆరోగ్యకరమైనవి కావు అని, తరచు బయట బిర్యానీ తినేవారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. మితంగా తింటే పర్వాలేదు గాని… తరచుగా తింటే మాత్రం ముప్పు తప్పదని చెబుతున్నారు.
మరి మాకు రోజూ బిర్యానీ తినడం ఇష్టం అనుకునేవారు.. ఇంట్లో నే బిర్యానీ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఎందుకంటే బిర్యానీని ఇంట్లో చేసుకుని తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. మరీ ఎక్కువ బిర్యానీ తింటే అది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
మనం రోజు తినే తిండి సమత్యులత పాటించడం ముఖ్యమని చెబుతున్నారు. తాజా కూరగాయాలు, ఆకుకూరలు, మాంసకృత్తులు, పండ్లు, మన ఆహారంలో ఉండాలని సూచిస్తున్నారు. వీటితో పాటు వ్యాయామం తప్పని సరి చేయాలని చెబుతున్నారు.
ముఖ్యంగా మాంసాహారంలో చేపలు చాలా మంచివి. వీటిని తింటే బోలెడు ప్రయోనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపల్లో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటికి పుష్కలంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. చేప కొవ్వు ఈజీగా అరిగి శక్తి వస్తుంది.
చేపల్లో ఉన్న కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్ బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. అందులో ఒమెగా 3 ఫ్యాట్స్ ఉండడం వల్ల అవి గుండెకు చాలా మేలు చేస్తాయి. మటన్, బీఫ్, పోర్క్లో చెడు కొలస్ట్రాల్ అధికంగా ఉంటాయని అంటున్నారు.
ఈ మూడు మాంసాహారాలను తింటే గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని చెబుతున్నారు. రొయ్యలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.