సినిమా వారి కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ కు ఆ ఇండస్ట్రీ ప్రముఖులు మద్దతు ఇవ్వాల్సింది పోయి జగన్ కి భయపడి పవన్ దే తప్పు అంటున్నారు. ఇలాంటి అనైక్యత టాలీవుడ్ ను తీవ్రంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. మరి సినీ పెద్దలకు జగన్ అంటే ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదు.
ఇక పోసాని తన ముద్దుపేరు ‘మెంటల్ కృష్ణ‘ అనే పేరును సార్థకం చేసుకుంటూ జగన్ కి కులపిచ్చి ఉందని ఎవరైనా నిరూపించగలరా? అని ఛాలెంజ్ చేశాడు. జగన్ ఇంతవరకు ఇచ్చిన అన్ని పోస్టుల్లో రెడ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ అవసరం ఆంధ్ర ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. సుమారు 800 రెడ్లకు కీలక పదవులు అప్పజెప్పాడు జగన్ రెడ్డి. అలాంటి రెడ్డికి కులపిచ్చి ఉందా అని ఇంకా ప్రశ్నిస్తున్నాడు పోసాని కృష్ణ మురళి.
ఈ కిందున్న క్లిప్పింగ్ చూస్తే జగన్ రెడ్డి కులపిచ్చి పోసానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక పవన్ పై విమర్శలు చేసి పవన్ ను తప్పు పట్టిన పోసానిపై అతనితో సినిమా తీసిన నిర్మాత పోసాని అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు. అతను చెప్పిన నిజాలు వింటే పోసాని క్యారెక్టర్ మీద ఎవరికైనా అనుమానం వస్తుంది. దాదాపు పదమూడు నిమిషాల పాటు సాగిన ఈ వీడియోలో పోసానిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కింద వీడియో ఉంది చూడచ్చు. ఓ రేంజ్ లో పోసాని రంగును బయటపెట్టాడు ఆయన.