వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛను ప్రతి సంవత్సరం 250 పెంచుతూ పోతాను అని చెప్పిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పినవిషయం అందరిీ తెలిసిందే. ఏ ఊర్లో పోయినా జగన్ రెడ్డి వృద్ధులు బూతులు తిట్టే పరిస్థితి ఉంది.
మరోవైపు పోలవరం, అమరావతి ఆపేయడంపై తూర్పుగోదావరి, పచ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో పోలవరం కట్టమంటే డబ్బులు లేవని చెబుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ పోలవరం పక్కన 254 కోట్లు పెట్టి వైఎస్ విగ్రహం, వైఎస్ పార్కు కడుతుందట. ఇదే 254 కోట్లు అన్నా క్యాంటీన్లపై ఖర్చు పెట్టి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఏడాది పాటు ఘనంగా నడిచేవి. పేదల ఆకలి తీర్చేవి. దానికి డబ్బుల్లేవని ఆ క్యాంటీన్లను మూసేసింది జగన్ ప్రభుత్వం.
కానీ 254 కోట్లు పెట్టి వైఎస్ విగ్రహం కడితే పేదవాడికి ఏం లాభం. అవే డబ్బులతో ఒక మోస్తరు ఎత్తిపోతల పథకం కడితే 10 వేల ఎకరాల పొలం సాగవుతుంది. వైఎస్ విగ్రహం కడితే ఏమొస్తుంది? కనీసం ఇంగితం మరిచి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. దీంత పేదవాడికి కూడు లేదు, ఉపాధి లేదు అన్నట్లుంది పరిస్థితి.