KCR పరువు తీసినా నోరు విప్పని సీఎం జగన్

ఆంధ్రాని ఎపుడో అట్టడుగుకి తోసేశాం అని ఏపీ ప్రజలను, ఏపీ సీఎంను అవమానించినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవరికీ అర్థం కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికి ఆంధ్రా సెంటిమెంటుతోనే కేసీఆర్ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సెంటిమెంటు వాడే అవకాశం దుబ్బాకలో రాలేదు. దీంతో జనాలకు ఏం చెప్పాలో తెలియక ఓడిపోయారు.

ఇపుడు హైదరాబాదు అనేసరికి మళ్లీ ఆంధ్రోడిని స్మరిస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రాని అట్టడుగుకి తోసేశాం అని కేసీఆర్ దుర్భాషలాడినా కౌంటర్ ఇవ్వగలిగే దమ్ము ఏపీ అధికార పార్టీ నేతలకు లేకపోవడం శోచనీయం.  

పై ట్వీట్లో చూడండి. 2019 ర్యాంకిగ్స్. ఏపీ స్థానం ఒకటి. తెలంగాణ స్థానం మూడోది. మరి కేసీఆర్ ఎపుడు ఆంధ్రాని తొక్కేశారో.... ఏపీలోని ప్రతి రియల్టరుకు, ఏపీలోని ప్రతి నిరుద్యోగికి, ఏపీలోని ప్రతి భవన నిర్మాణ కూలీకి తెలుసు. తప్పు చేసింది కాబట్టే జగన్ ప్రభుత్వం కేసీఆర్ వ్యాఖ్యాలకు తిరిగి కౌంటర్ ఇవ్వలేకపోతోంది.

ఏం చేద్దాం ఏపీ ప్రజల కర్మ. చంద్రబాబు చేసిన అభివృద్ధికి గట్టి సాక్ష్యాలున్నా కేసీఆర్ ఇలా ధైర్యంగా విమర్శలు చేస్తున్నారంటే... సాక్ష్యాల్లేకపోతే ఇంకేమనేవారో మరి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.