టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మనసులో ఉన్నది అనేసే టైపు. ఎక్కడా మొహమాటం లేదు. వెనక్కితగ్గేది అసలే లేదు. తన మన అనే తేడా కూడా లేదు. తప్పు అంటే.. తప్పే! ఇదే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగా మారింది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అయ్య న్నతో ఆపశోపాలు పార్టీకి తప్పలేదు. మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రంగా ఆయన భూ కుంభకోణం ఆరోపణలు చేశారు.
ఇది..ప్రతిపక్ష వైసీపీకి అప్పట్లో వజ్రాయుధంగా మారింది. దీనిపై సమాధానం చెప్పలేక.. పార్టీ ఇబ్బంది పడింది. ఏకంగా.. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించక తప్పని పరిస్థితివ చ్చింది. ఇది పార్టీకి ఇబ్బందిగా మారిందనడంలో సందేహం లేదు. అయితే.. ఇప్పుడు మరోసారి అయ్య న్న నోరు విప్పారు. అదే గంటాపై విరుచుకుపడ్డారు. గంటా శ్రీనివాసరావుపై కొంత పరుషంగానే వ్యాఖ్యా నించారు.
గంటాకు టీడీపీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎందుకంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గంటా శ్రీనివాసరావు తాజాగా టీడీపీపై స్పందించారు. నారా లోకేష్ చేపడుతున్న యువగళం అద్భుతంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఇందులో తప్పులేదు. అయితే.. ఇన్నాళ్లుగా తాము టీడీపీకి అండగా ఉన్నామని.. ఇప్పుడు గంటా ఎంట్రీతో తమ క్రెడిట్‌కు ఎక్కడ దెబ్బపడుతుందని అనుకున్నారో ..ఏమో అయ్యన్న ఆయనపై రివర్స్ ఎటాక్ చేశారు.
ఇక, ఈ ఇద్దరి వల్ల.. పార్టీకి ప్రయోజనం ఉందా? అంటే.. గత ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి అయ్యన్న ఓడిపోయారు. గంటా గెలిచినా ఇంటికే పరిమితంఅయ్యారు. కానీ, రాజకీయంగా మాత్రం ఇద్దరూ పార్టీని ఇరకాటంలో నెడుతున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా కనీసం చంద్రబాబును ఇప్పటి వరకు కలవలేదు. ఇక, తను చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీని డిఫెన్స్‌లో పడేస్తున్న అయ్యన్న మొత్తంగా చూస్తే.. వీరివల్ల ప్రయోజనం మాట ఎలా ఉన్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదనేది వాస్తవం.