వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మెంట్ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సెట్లో కూర్చున్నపుడు తాము నాన్నగారి గురించి, వేదాలు, మంత్రాలు, అక్కినేని, తొక్కినేని అంటూ చాలా విషయాలు మాట్లాడుకునే వారమని బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ పొరపాటున ఫ్లోలో మాట్లాడిన మాటలకు పెడర్ధాలు తీస్తూ బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారు.
ఇదే సందు అంటూ కొందరు వైసీపీ నేతలు…కులాల పేరుతో బాలయ్యను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో, అక్కినేని అభిమానులు…. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు బయట తిరగనివ్వబోమని, ఆయనను అడ్డుకుంటామని అక్కినేని అభిమాన సంఘాల నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.
ఆ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయని రోజా అన్నారు. అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని ఆమె విమర్శించారు. గతంలో కూడా బాలకృష్ణ ఈ తరహా వ్యాఖ్యలు చాలా చేశారని అన్నారు. అదే ఎన్టీఆర్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచించుకోవాలంటూ హితవు పలికారు. ఇటీవల, చిరంజీవిపై కూడా రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అదే తరహాలో ప్రస్తుతం బాలకృష్ణని కూడా టార్గెట్ చేస్తూ రోజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అదే ఎన్టీఆర్ ను విమర్శిస్తే?..అంటూ ఏఎన్నార్ అభిమానులను రెచ్చగొట్టేలా రోజా వ్యాఖ్యలున్నాయని కామెంట్లు వస్తున్నాయి.