• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అలాంటి ఏటీఎంలకు ఆర్బీఐ వార్నింగ్…ఫైన్ తప్పదట

ఖాళీ ఏటీఎంలపై ఆర్బీఐ కొరడా...నో క్యాష్ ఏటీఎంలకు చెక్

admin by admin
August 11, 2021
in Around The World, India, Top Stories
0
0
SHARES
138
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లింగ్ మెషీన్ అని అర్థం. కానీ, మన దేశంలో ప్రజలు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ ఇచ్చే మెషీన్ అని భావిస్తుంటారు. వాస్తవానికి కూడా ఏటీఎం చేయాల్సిన పని కూడా అదే. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ఏ టైంలో నైనా మనీ విత్ డ్రా చేసుకోగలగడమే ఏటీఎం ప్రధాన ఉద్దేశం. కానీ, మన దేశంలోని చాలా ఏటీఎంలు నిత్యం నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుంటాయి.

నోట్ల రద్దు సమయంలోనైతే ఈ బోర్డులు మరింత ఎక్కువగా దర్శనమిచ్చేవి. ఆ సమయంలో ఏటీఎంల ముందు గంటలకొద్దీ పడిగాపులు కాసినా….డబ్బులు వస్తాయన్న గ్యారెంటీ ఉండేది కాదు. ఇప్పటికీ, దేశంలోని చాలా ఏటీఎంలు సరిగ్గా క్యాష్ మెయింటెన్ చేయడం లేదని, ఎప్పుడు చూసినా కొన్ని ఏటీఎంల ముందు సర్వర్లు పనిచేయడం లేదనో, నో క్యాష్ అనో బోర్డుల పెట్టే ఉంటాయని వినియోగదారులు వాపోతున్నారు. అటువంటి సమయాల్లో ఖాతాదారుల మెదళ్లను ఓ ప్రశ్న తొలిచేస్తుంటుంది.

తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ముక్కుపిండి ఫైన్ వసూలు చేస్తున్నాయి. కానీ, ఏటీఎంలలో నో క్యాష్ బోర్డు పెడితే…ఆ బ్యాంకుకు ఫైన్ ఎందుకు వేయరు? బహుశా ఖాతాదారుల గోడును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విన్నట్లుంది. అందుకే, తాజాగా ఏటీఎంలలో నగదు కొరతపై ఆర్బీఐ తీవ్రంగా స్పందించింది. ఏటీఎంలో నగదు లేకపోతే ఆ బ్యాంక్‌కు రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తామని ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. బ్యాంక్‌ ఖాతాదారులకు ఖాళీ ఏటీఎంలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నందున ఆర్బీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ఏటీఎంల్లో ఎప్పటికప్పుడు నగదును నింపాల్సిందేనని, లేకుంటే ఫైన్ గా ఫైన్ వేస్తామని ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది.

‘ఒక నెల మొత్తంలో 10 గంటలకు పైగా ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే ఆ ఏటీఎంకు రూ.10,000 జరిమానా విధిస్తాం. ఇలా ఎన్ని ఏటీఎంలు ఖాళీగా ఉంటే రూ.10,000 చొప్పున అన్ని జరిమానాలు తప్పవు’ అని ఆర్బీఐ తన తాజా సర్క్యులర్ లో స్పష్టంగా పేర్కొంది. ఏటీఎంల ద్వారా ప్రజలకు నగదు సకాలంలో సక్రమంగా అందాలని, అందుకు సరిపడా నగదును వాటిలో ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికే ఖాళీ ఏటీఎంలపై ఈ జరిమానాలను విధిస్తున్నామని తెలిపింది.

Tags: ATMs with no cash boards in Indiaimpose fine of Rs.10000Indian atm systemRBI warning to ATMs
Previous Post

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Next Post

కరోనా కంటే యమ డేంజర్ ఈ వైరస్…నిపుణుల వార్నింగ్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

కరోనా కంటే యమ డేంజర్ ఈ వైరస్...నిపుణుల వార్నింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra