టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన `యువగళం` పాదయాత్ర మూడోరోజు మరింత ఉత్సాహంగా ముందుకు సాగింది. తొలిరోజు శుక్రవారం 8.5 కిలో మీటర్ల దూరాన్ని పూర్తి చేసిన లోకేష్ రెండో రోజు శనివారం 9.3 కిలో మీటర్లు నడిచారు.
ఇక, ఆదివారం మూడో రోజు కుప్పం నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల కు ప్రారంభించిన పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. అడుగులో అడుగు వేస్తూ.. ఉవ్వెత్తున లోకేష్‌ను అనుసరించారు.
ఇక, పాదయాత్రలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం శాంతిపురంలో నిర్వహిస్తున్న వార సంతలో నారా లోకేష్ పర్యటించారు. సంతలో ప్రజలు, దుకాణాదారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వినియోగదారులు వివరించారు. వార సంత రహదారిపై నిర్వహించుకుంటున్నామని, స్థలం కేటాయించాలని దుకాణాదారులు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.
కొబ్బరి బొండాలు అమ్మే దివ్యాంగుడు నాగరాజు.. ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నానని తెలపడంతో నాలుగు రోజుల్లో అందజేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల కేంద్రాలను మూసేసి… కనీసం తాగునీరు ఇవ్వలేని చెత్త ప్రభుత్వమని విమర్శించారు. కనీసం బస్టాండ్లు పాడైతే తిరిగి నిర్మించే దిక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు. వార సంత నిర్వహణకు టీడీపీ అధికారంలోకి రాగానే స్థలం కేటాయిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
రోడ్డుపక్కన టీ తాగుతూ..
శాంతిపురంలో టీ స్టాల్ కి వెళ్లి టీ తాగిన లోకేష్.. నిర్వాహకుడు కృష్ణప్పతో కాసేపు మాట్లాడారు. తనే స్వయంగా టీ కలిపి పలువురు కార్యకర్తలకు ఇచ్చి.. తేనీరు రుచి చూశారు. ఈ సందర్భంగా గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు పెరిగిపోవడంతో పెద్దగా ఏమీ మిగలడం లేదంటూ క్రిష్ణప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిపురం మెయిన్ సెంటర్లో భారీ గజమాలలతో నారా లోకేష్‌కు నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
లోకేష్ వద్దకు నడిచి వచ్చిన కృతజ్ఞత తేజ…#WalkwithLokesh #Lokeshinkuppam #yuvagalam #YuvaGalamPadyatra #WalkforbetterAP #YouthofAP #NaraLokeshPadyatra #FortheChange #WalkforbetterAP #FortheFutureofAP #Padayatra4000km pic.twitter.com/LIdZXQIYJn
— SAI KORRAPATI (@saikorrapati) January 28, 2023