స్పెషల్ స్టేటస్ కావాలా? క్యాపిటల్ కావాలా?
మద్య నిషేధం అని చెప్పి రోజుకి ఒక కొత్త బ్రాండ్ దింపిన వైసీపీ ప్రభుత్వం!@JSPCampaigns#HelloAP_ByeByeYCP???? pic.twitter.com/O8bWLjATf7
— JanaSena Party (@JanaSenaParty) March 29, 2024
“వచ్చేది ఓట్ల తుఫాను.. ఈ తుఫానులో నీ ఫ్యానురెక్కలు విరిచేసేందుకు ప్రజలు. పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.. కాసుకో జగన్“ అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన `ప్రజాగళం` బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
“ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం. దీనిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్… టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం. అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయాం. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం“ అని చంద్రబాబు చెప్పారు.
చెత్త ముఖ్యమంత్రి!
సీఎం జగన్ .. చెత్తపై కూడా పన్నులు వేసి ప్రజల రక్తం పీల్చారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చెత్త ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. “ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడుతున్నారు. అందుకే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజాగళం పేరిట ఇక్కడికి వచ్చాను. ప్రజలు గళం విప్పాలని చెప్పడానికి వచ్చాను. రైతులు పరిస్థితులు బాగున్నాయా? మహిళలకు రక్షణ ఉందా? ఈ దుర్మార్గుడు తన పాలనలో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడు. చెత్త మీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్ను వేశాడు. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా? జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ ఐదేళ్లలో అందరూ నష్టపోయారు. ఆ విషయాన్ని చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీ అభివృద్ధి, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పడానికి వచ్చాను“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రజావ్యతిరేక తుపాను మాదిరిగా వస్తోందని, ఈ తుపాను తాకిడికి ఫ్యాను గిలగిలా కొట్టుకుంటుందని, చివరికి ఫ్యాను డస్ట్ బిన్ లో చేరుకుంటుందని తనదైన శైలిలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. “నా జీవితకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడని నేను ఊహించలేదు. జగన్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. చట్టంపై గౌరవం లేదు. వ్యవస్థలపై విశ్వాసం లేదు. అతడికి తెలిసిందల్లా దోపిడీ. దోచుకున్న డబ్బుతో అక్రమాలు చేయడం. ఆ డబ్బులతో ప్యాలెస్ లు కట్టుకోవడం. మీడియా సహా వ్యవస్థలను మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్ లను మనపై పురికొల్పడం“ అని చంద్రబాబు దుయ్యబట్టారు.