ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహమేంటి? ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఆ పార్టీ ఎలాంటి వైఖరి అవలంభిస్తోంది? అనే చర్చ జోరుగా తెరమీదికి వస్తోంది. ఎందుకంటే.. ఒకవైపు.. మోడీ.. రైతులకు అన్యాయం చేశారంటూ.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలు ఈ నెల 27న ఇచ్చిన బంద్కు వైసీపీ సహ కరిస్తోంది. అంటే.. మోడీని ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోయినా.. ఆయనను వ్యతిరేకించే పార్టీతో జత కట్టినట్టే కదా!
సో.. దీనిని వైసీపీ ప్రధాని మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని.. అదేవిధంగా ఏపీకకి సంబంధించి కేంద్రం చేస్తున్న అవమానాలు.. ఆర్థిక అసమానతల విషయంలోనూ మోడీని ఎండగట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు.
ఇదే తరహా విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయితే… అనూహ్యంగా వైసీపీ టోన్ మళ్లీ మారిపోయింది. ప్రధానిని ఒకవైపు వ్యతిరేకిస్తూ.. సాగుతున్న ఉద్యమానికి, బంద్కు రాష్ట్ర ప్రభుత్వంగా తాము మద్దతిస్తు న్నా మని.. బస్సులు, వాణిజ్య సంస్థలను మూసివేస్తున్నామని.. ప్రకటించారు.
మళ్లీ 24 గంటలు గడవక ముందే.. వైసీపీ రాజ్య సభ సభ్యుడు.. పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. మోడీ చేసిన ప్రసంగంలోని ప్రతి అంశం కూడా దేశ ప్రజల మనోభావాలను ప్రతిఫలింపజేసిందని స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడం సహేతుక చర్యగా భావిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి కావాల్సింది ఉగ్రవాదం కాదని, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించడమేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
ఉగ్రవాదం మీద ఆధారపడుతూ.. ఆ భూతాన్ని పెంచి పోషిస్తోన్న కొన్ని దేశాలకు ప్రధాని ఇచ్చిన ప్రసంగం కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఇక్కడే అసలు విషయం అంతు చిక్కడం లేదు.. అసలు మోడీపై వైసీపీవైఖరి ఏంటి? ఢిల్లీలో పొగిడి.. ఏపీలో తిట్టడమా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమా? లేక ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
Our PM Sri @NarendraModi’s speech in @UN General Assembly should be an eye-opener for those who sponsor terrorism. There is no space for terrorism in today’s world which needs development and transformation in the pandemic times. When India grows, the whole world grows.@PMOIndia
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2021