గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాత్రిపూట చీకట్లో గన్ మెన్, డ్రైవరుతో కలిసి వేగంగా చెన్నైకి వెళ్తుండగా ఆయన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీకి గుద్దుకున్న కారు తుక్కుతుక్కయ్యింది. డ్రైవరు, గన్ మెన్ గాయపడ్డారు. వారికి స్పృహ కూడా లేదు. అయితే, అదృష్టవశాత్తూ ఎమ్మెల్యే ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వరప్రసాద్ కి ఏ గాయాలు కాలేదు. లక్కీగా నాయుడు పేట సమీపంలోని మనుషులున్న ఓ దాబా దగ్గర ప్రమాదం జరగడంతో వారందరు సాయం చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించాక వారికి కూడా ప్రాణానికి ఏం ప్రమాదం లేదని తేలడంతో ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటికెళ్లిపోయారు. సాధారణంగా రాజకీయ నేతలు చాలా వేగంగా వెళ్తుంటారు. 120కి ఎవరూ తగ్గరు. ఇక ఇన్నోవాలు అయితే 140 పై వేగంతో ప్రయాణిస్తుంటారు. ఎంత డ్రైవర్ నిపుణుడు అయినా… రాత్రిపూట చీకటి ఎవరికి అయినా ఒకటే. నిద్ర ఎవరికి అయినా ఒకటే. జాగ్రత్తగా ఉండకపోతే చాలా డేంజర్. ప్రస్తుతం ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.