తల అయినా తెగిపడలి ???????? తప్ప ????తల వంచేదే లేదు ✊ #JSPForAP_Fisherman #JSPForFisherman #JanaSenani @JanaSenaParty @PawanKalyan pic.twitter.com/4hyAXiWrpx
— ⛦iSmArT ℕ???????????? ????????????????????????????????✮⛟⚐ (@ISmartNani94) February 21, 2022
ఏమైనా జగన్ క్యాంప్ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేం. తాము అభిమానించి..ఆరాధించే జగన్ ను పల్లెత్తు మాట అన్నంతనే.. సదరు నేత మీద 360 డిగ్రీల్లో టార్గెట్ చేసే విషయంలో తగ్గేదెలే అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఒకవేళ విమర్శలు చేసినోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే వారు మరింత ఉత్సాహంతో చెలరేగిపోతారు. ఎందుకంటే.. పవన్ ను ఉద్దేశించి నానా మాటలు అనటానికి ఇప్పటికే ఒక స్టాండర్డ్ మసాలా బాక్స్ ను సిద్ధం చేసేశారు.
పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఆయన మూడు పెళ్లిళ్లు.. ప్యాకేజీ మాష్టారు.. మైండ్ సెట్ సరిగా ఉండదు.. ఆవేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. చివరకు పవన్ పెంచే గడ్డం గురించి కూడా విమర్శలు చేస్తూ.. అందులోనూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం జగన్ బ్యాచ్ కు చెల్లుతుంది.
నిత్యం ప్యాకేజీ స్టార్ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడే జగన్ క్యాంప్ వారు.. ఇప్పటివరకు పవన్ తీసుకున్న ప్యాకేజీకి సంబంధించిన ఒక్క ఆధారాన్ని చూపించలేకపోవటాన్ని మర్చిపోకూడదు. ఒక నేత టీనేజీలో ఉన్నప్పుడో.. కాలేజీలో ఉన్నప్పుడు పార్టీ వేళ తీసిన ఫోటోల్ని తీసుకొచ్చి విష ప్రచారం చేసే అలవాటున్న వారికి.. పవన్ లోని ప్రతి యాంగిల్ ను తప్పు పట్టే పని చేయటంలో పెద్ద విషయం కాదు.
జగన్ లాంటి అధినేత కమ్ ముఖ్యమంత్రి ఇగోను ప్రశ్నిస్తే ఆయనకు కొమ్ము కాసే వారికి కోపం రాదా? ఏంటి?
పేరుకు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతారు కానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో వారికి మించినోళ్లు అస్సలు కనిపించరు.
ఒక సీఎంను అలా అంటావా? నీకెంత ధైర్యం? కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న సీఎంను అనటానికి నీకు నోరెలా వచ్చింది? అని అదే పనిగా మాటల్ని పారేసుకునే బ్యాచ్.. ఇదే జగన్ విపక్ష నేతగా ఉన్న వేళలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు.. జగన్ ఒక ఫైర్ బ్రాండ్ అని.. నిప్పు కణిక అని.. ప్రజల పక్షాన నిలిచిన మాట్లాడారంటూ పొగిడేసిన నోళ్లు.. ఈ రోజున పవన్ ను న్యాయమైన అంశాల గురించి మాట్లాడినప్పుడు.. సీఎం తీరును సరిగా లేదని సున్నితంగా విమర్శించినప్పుడు భరించలేనితనాన్ని ప్రదర్శించటం గమనార్హం.
జగన్ ను ఇగోను ప్రశ్నించటమే తప్పన్నట్లుగా ఇప్పుడు వాదనలు.. పోస్టులు పెట్టేస్తున్నారు. మూడు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇలా మాట్లాడటం ఏమిటన్నది వైసీపీ బ్యాచ్ కు అస్సలు అర్థం కావట్లేదు. ఆ మాటకు వస్తే వారికి ఇదంతా కొరుకుడుపడని రీతిగా మారింది.
ఎందుకంటే.. అధికారం చేతిలో ఉన్నప్పుడు అందరు పాహిమాం.. పాహిమాం అనాలే తప్పించి.. తప్పుల్ని ప్రశ్నించేపని అస్సలు చేయకూడదన్నట్లుగా వారి మైండ్ సెట్ కనిపిస్తుంది. ఇగోను ప్రశ్నిస్తే.. అన్నయ్యను అవమానిస్తారా? అంటూ తొండి వాదనను వినిపిస్తున్న వైనం ఆకాశం మీద ఉమ్మేసినట్లే ఉంటుందన్నది వారికి అర్థమవుతుందంటారా? ఆ మాత్రం గుజ్జు ఉంటే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయంటారా?
మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించాలా? మీరేమైన రాచరికంలో ఉన్నారు అనుకుంటున్నారా – JanaSena Chief Sri @PawanKalyan#JSPForAP_Fishermen pic.twitter.com/MebASYLjGE
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2022