మద్య నిషేధం అనే బూటకపు హామీతో మహిళలను వంచించి, నేడు జే-బ్రాండులతో ప్రజల కష్టాన్ని మద్యం పేరుతో లాగేసి, వేల కోట్లు తన జేబులో వేసుకున్న జగన్ రెడ్డి మోసాన్ని, మహిళలు గళమెత్తి ప్రశ్నించడానికే నేటి "నారీ సంకల్పదీక్ష".#NariSankalpaDeeksha pic.twitter.com/446D7ys2GX
— Telugu Desam Party (@JaiTDP) January 31, 2022
ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులకు, నేరాలకు నిరసనగా నేడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు దీనికి తరలివచ్చారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా మహిళలపై అరాచకాలు బాగా పెరిగిపోయాయి.
దారుణం జరిగిన తర్వాత కూడా నిందితులకు శిక్షలు పడటం లేదు. దీంతో నేర గాళ్లకు భయం లేకుండా పోయింది. పోలీసులు రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి వైసీపీ నేతలకు అండగా ఉండటంలో బిజీ అయిపోవడం వల్ల సామాన్యులకు రక్షణ లేదని తెలుగుదేశం మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.
నేరగాళ్ల పరిస్థితి పక్కన పెడితే వైసీపీ నేతలు, జగన్ నియమించిన వలంటీర్ల నుంచే మహిళలకు రక్షణ లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి కొన్ని సంఘటనలను కూడా పార్టీ ఉదహరించింది.