వైసీపీ కీలక నాయకులు.. ఢిల్లీ బాటపడుతున్నారా? ఈ రోజు సాయంత్రమే ఢిల్లీకి వెళ్తున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమపైనా.. తమ పార్టీపైనా.. ప్రధాన ప్రతిపక్షం.. టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న నేపథ్యంలో ముందుగానే వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ.. విజయసాయిరెడ్డి..ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..పలువురు ఎంపీలు.. ఢిల్లీకి వెళ్లనున్నట్టు.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తన పాత పరిచయాలతో నిత్యం మోడీ ఆఫీసు చుట్టూ తిరిగి చంద్రబాబును మోడీకి మధ్య గొడవలు పెట్టడంతో విజయం సాధించారు సాయిరెడ్డి. ఆ తర్వాత కూడా మోడీని దేశమంతా వ్యతిరేకించిన సాయిరెడ్డి మోడీ జపం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మంచి యాక్సస్ ఏర్పరుచుకున్నారు సాయిరెడ్డి.
వైసీపీకి సంబంధించిన అన్ని అంశాలను ఆయనే ఢిల్లీలో చక్కబెడుతుంటారు. ఢిల్లీ నుంచి ఏం కావాలన్నా.. ఏం చేయాలన్నా.. కూడా సాయిరెడ్డే కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన సారథ్యంలోనే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్లి.. అక్కడ తమపై నేరారోపణలు.. పెరగకకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. ఇప్పటికిప్పుడు కేంద్రంలోని పెద్దలు ఎవరూ కూడా వైసీపీకి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. అదేసమయంలో పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు కేంద్ర మంత్రులు కూడా .. తాజా విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది.
“ఇది పెద్ద విషయమా? ప్రతిపక్షం అన్నాక.. కొన్ని విమర్శలు చేస్తుంది. ఏదైనా ఉంటే.. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చేసుకోవాలి. రోడ్డున పడడం ఎందుకు?“ అని కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి వైసీపీ నేతల గోడు వినేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.
అయితే.. ఏపీలో అధికార పార్టీగా ఉండడం.. ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు రాజ్ నడుస్తోందనే వ్యాఖ్యలు వినిపించ డం.. వంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఢిల్లీ కేంద్రంగా వైసీపీపై చార్జ్‌షీట్ ఇచ్చేందుకు రెడీ అవడం.. సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కూడా ఢిల్లీ బాట పట్టారు.
ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక మాత్రం ఎవరికైనా అప్పాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో.. అప్పటి వరకు వైసీపీ నాయకులు ఎవరిని కలుస్తారు?
తమకు కలిసి వచ్చే పార్టీలతో చర్చిస్తారా..? తమకు మద్దతుగా వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం వైసీపీ నాయకుల ఢిల్లీ టూర్ అంతా కూడా సీఎం జగన్ కనుసన్నల్లోనే నడుస్తోందని అంటున్నారు. మరి ఏం చేస్తారో.. చూడాలి.
ఈ టూర్ మరో ముఖ్య ఉద్దేశం చంద్రబాబు టూర్ తర్వాత జగన్ టూర్ పెట్టుకోనున్నారు. ఆ అప్పాయింట్ కోసం ఢిల్లీలో మంతనాలు చేయడానికి వీరు వెళ్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఢిల్లీలో తెలుగు పార్టీల రచ్చపై మీ దగ్గురున్న సమాచారాన్ని కింద కామెంట్ల రూపంలో మాతో పంచుకుంటే మేము మరింత సమాచారంతో అందరికీ తెలియజేస్తాం.