దళితులపై జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో అనేక దాడులు జరిగిన విషయం మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో జగన్ కి దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు మద్దతు ఇచ్చారని విశ్లేషకులుచెబుతున్నారు. అదేంటో గాని తనకు మద్దతు ఇచ్చిన దళితులు, ముస్లింలపై అనేక ఘటనలు తన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి.
జగన్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకున్న మాకే అన్యాయం చేస్తున్నారు ఇదేమైనా ధర్మమా అంటు నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు ముస్లింలు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నజీర్ రాష్ట్రంలో దాడులు అరాచకాలను ప్రశ్నించారు. అదే సమయంలో అసలు ఏం చేసింది ఈ గవర్నమెంటు ప్రజల కోసం అని నిలదీశారు.
పోలవరం పూర్తిచేయక పోగా ప్రత్యేక హోదా సాధించకపోగా రాజధానిని మూడు ముక్కులాటగా చేయగా ప్రజలకి ys jagan ఇచ్చింది ఇవే… RTC చార్జీలు పెంపు, విద్యుత్ చార్జీలు పెంపు, రేషన్ సరుకుల ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు, ఇసుక ధరలు పెంపు, మద్యం ధరలు మాత్రం మొదట పెంపు తరువాత తగ్గింపు అంటూ అతని ఆవేదన వినండి