పట్టాభి వ్యాఖ్యల విషయంలో, వైఎస్ఆర్సిపి మరియు ముఖ్యమంత్రి తెలియకుండానే టిడిపి ఉచ్చులోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం మరియు టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కుటుంబ సభ్యులపై దాడి చేయడం ద్వారా, వైయస్ఆర్సిపి జనంలో సానుభూతి కోల్పోయింది.
ఈ దుర్ఘటనలపై దాడులపై వైసీపీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, పార్టీ నేతలు యదావిధిగా బాధితులపైనే అరవాల్సి రావడంతో తప్పును కవర్ చేసుకునే క్రమంలో వైసీపీ మరో పెద్ద తప్పు చేస్తోంది. అంటే తప్పు మీద తప్పు చేస్తోంది. ఒకరకంగా వైసీపీ ఒక ఉచ్చులో ఇరుక్కుందని చెప్పాలి.
మంత్రి కొడాలి నాని పలుమార్లు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ఇద్దరిని చాలా దారుణమైన పదాలతో దూషించారు. ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే కొడాలికి మీడియా కవరేజ్ ఎక్కువ.
తర్వాత అది ఇతర మంత్రులకు పాకింది. దీంతో వైసీపీ బూతు మంత్రుల పార్టీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కొడాలి వాడిన భాష ముందు పట్టాభి వాడింది పది శాతం కూడా కాదు.
కాబట్టి జగన్ ని తిట్టడం వల్ల పార్టీ ఆఫీసుపై దాడి చేశాం అని కవర్ చేసుకునే వైసీపీ ప్రయత్నం విఫలమైంది. కొడాలి నానికి చంద్రబాబు ఏ రిప్లై ఇవ్వకపోడం చంద్రబాబు వ్యూహం అనే చెప్పాలి. పైగా మొన్న జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసినపుడు కూడా చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటించడం ఇపుడు బాబుకు పనికొచ్చింది. ఇపుడు చంద్రబాబు వ్యూహాత్మక ఆగ్రహం వైసీపీకి చాలా డ్యామేజ్ చేసింది. ప్రజల్లో జగన్ ను డ్యామేజ్ చేసింది.
తాజాగా పట్టాభి పేరు చెప్పి వైసీపీ దాడి చేయడం ద్వారా భవిష్యత్తులో వైసీపీ వాళ్లు తమంతట తామే బూతులు ఆపేయాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. విమర్శలు చేసినందుకు దాడి చేశాం అని చెబుతున్న వైసీపీ ఏ మొహం పెట్టుకుని భవిష్యత్తులో బూతులు వాడగలదు. అంటే వైసీపీ చేసిన పని తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా వైసీపీకి ముందరికాళ్ల బంధం వేసిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.