ప్రత్యర్థులు మాటలకు పదునుపెట్టినపుడు రాజకీయం రంజుగా మారుతుంది. 2.5 సంవత్సరాలు జగన్ ని వదిలేసిన పవన్ రాష్ట్రం ఏమైపోయినా పట్టించుకోలేదు.
సడెన్ గా తన సినిమా జోలికి వచ్చేటప్పటికి కోపం కట్టలు తెంచుకుని ఓ రేంజ్ లో ఏపీ సర్కారును ఏకేశాడు. దీంతో కొంతకాలం క్రితం పవన్ ప్రకటించిన ఏపీ రోడ్లపై శ్రమదానం కార్యక్రమానికి భారీ మద్దతు వచ్చింది.
ఈ టాపిక్ తో జగన్ సర్కారును పవన్ కళ్యాణ్ బాగా ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి.
అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున ఏపీ రోడ్లను జనసేన కార్యకర్తల డబ్బులతో పూడ్చి ప్రభుత్వం ఫెయిల్యూర్ ను జనానికి చెప్పే ప్రయత్నం చేశారు.
దీనికి కొద్ది కాలం ముందు ఏపీలో రోడ్ల గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. అపుడు జగన్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ రోడ్ల విమర్శలపై ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియాలను విమర్శిస్తూ ఇవి మా కర్మకొద్దీ ఉన్నాయన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
నిజానికి ఆ మాటతో జగన్ బిగ్ మిస్టేక్ చేశారు. ఎందుకంటే అంతకాలం జనాల వద్ద సాక్ష్యాలు లేని వాటితో మీడియాపై జగన్ నిందలు వేసి తప్పించుకునేవారు. కానీ ఏపీ ప్రజలు రోడ్లపై నరకాన్ని అనుభవిస్తున్నారు. అది ఆంధ్రజ్యోతే చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రోడ్ల గురించి అబద్ధాలు రాస్తే ప్రజలకు తెలియదా… వారు అనుభవిస్తున్నారు కదా. జగన్ చేసిన ఆ వ్యాఖ్యలతో మీడియా రైటే కానీ జగన్ వే అబద్ధాలు అని ఆరోజు అందరికీ అర్థమైంది.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున రేపు చేపట్టిన శ్రమదానానికి ఎలా స్పందించాలో తెలియక వైసీపీ తలపట్టుకుంటోంది.
ఏవో కొన్ని గోతులు పూడ్చి, ఫొటోలు దిగడం వల్ల ఏంటి ప్రయోజనం? అసలు, పవన్ కల్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించడం కూడా అనవసరం అని, ఆయన స్థాయికి తాము దిగజారలేమని పేర్కొన్నారు. చవకబారు ప్రచారం కోసం పవన్ ఇలాంటి పోరాటాలు చేయడం మానుకోవాలి – సజ్జల
ఇందులో చవకబారు తనం ఏముందో సజ్జలే చెప్పాలి. జనం రోడ్లు బాలేక నడుం విరగ్గొంటుకుంటున్నారు. జనసేన రోడ్లను బాగుచేస్తుంటే జనం సంతోషిస్తున్నారు. దీన్ని చవకబారు అనడం ద్వారా ప్రజల్లో వైసీపీ అయోమయం, ఆందోళన అర్థమైంది.
పవన్ చవకబారు ప్రచారం కోసం రోడ్లను పూడుస్తానంటే ఎందుకు భయపడి పర్మిషన్ ఇవ్వలేదో వారికే తెలియాలి. సరిగ్గా నిరసనకు ముందు రోజు పవన్ నిరసన ప్లాన్ చేసిన రోడ్లను మరి ఎవరికి భయపడి జగన్ సర్కారు రిపేరు చేయించింది. ఇవన్నీ జనాలకు అర్థం కావా…. వైసీపీ పరిస్థితి మరీ ఆందోళకరంగా తయారైంది. అది స్పష్టంగా వైసీపీ నేతల మాటల్లో అర్థమవుతోంది.
తాజాగా సజ్జల మాటలతో జనం వైసీపీ గ్రాఫ్ దిగజారుతున్న ఆందోళన వారిలో బాగా కనిపిస్తోందని అర్థం చేసుకుంటున్నారు.