వైసీపీలో అత్యంత కీలకమని భావిస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు భారీగా తాయి లాలు పంచారని టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ అభ్యర్థి పరిస్థితి ఆశాజనకంగా లేదనే సంకేతాలు రావడంతో పోలింగ్ ముందురోజు రాత్రి పెద్దఎత్తున నగదు, బహుమతులు పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.ఐదు వేల వరకూ అందజేశారు. ఫార్మా కం పెనీల ఉద్యోగులతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని కీలక వర్గాలకు చెందిన ఓటర్లకు వెండి బిస్కెట్లను బహుమతులుగా అందజేశారని టీడీపీ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు.
దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. అయితే పోలీసులు, జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించకపోవ డంతో వెండి బిస్కెట్లను అక్కడ నుంచి బయటకు తరలించేశారంటూ విపక్షాలు ఆరోపించాయి.
ఇక ఆదివారం హెచ్బీ కాలనీలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధి సహాయకుడిని పీడీఎఫ్ నేతలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి ఓటర్ల జాబితాతోపాటు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పంపకాల విషయంలో జాగ్రత్తపడ్డారు. నేరుగా న గదు ఇస్తే తీసుకోరని భావించే ఓటర్లు, వర్గాలకు చెందిన వారికి వైసీపీ నేతలు ప్రత్యేకంగా 15 గ్రాములు వెండి బిస్కెట్లను అందజేశారని తెలిసింది.
అన్నివర్గాల్లోనూ తమ పార్టీకి ఆదరణ ఉందంటూ జబ్బలు చరుచుకునే వైసీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం గెలుస్తామనే ధీమా లేకనే తాయి ఎలాలకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ అనేది చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఈసారి పోటీలో వున్న టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి భిన్నంగా భారీగా డబ్బు, బహుమతులు పంపిణీ చేశారని ఆయా పార్టీలు ఆరోపించాయి.
తమపాలన జనరంజకంగా ఉందని, అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికే వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడంపై అన్నివర్గాల్లోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎ న్నిక ఫలితం తమ పార్టీకి ప్రతికూలంగా రాబోతోందంటూ తెలియడంతోనే వైసీపీ నేతలు అప్రమత్తమైనట్టు సమాచారం. విశాఖను పాలనా రాజధా నిగా ప్రకటించినప్పటికీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైతే పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని పార్టీ నేతలు భావించారని తెలుస్తోంది.
దీంతో ఎలాగైనా ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని దక్కించుకోవాలని, దీనికోసం ఏదైనా చేయాలని పార్టీ అధిష్ఠానం స్థానిక నేతలను ఆదేశించినట్టు సమాచారం. అందువల్లే పార్టీ నేతలు కూడా సాధారణ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేయడంతో పాటు పోలింగ్ ముందురోజు రాత్రి భారీగా పంపకాలు జరిపినట్టు చెబుతున్నారు.