వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ అధినేత.. జగన్ పాదయాత్ర చేశారు. అదేవిధంగా రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు దీనిని నమ్మారు. అదేసమయంలో అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత కావొచ్చు.. చంద్రబాబు పై సానుభూతి తగ్గ డం కావొచ్చు.. ఏదేమైనా.. జగన్‌ను భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు.
దేశంలో ఏ పార్టీకి లభించని 49.18 శాతం ఓటు బ్యాంకును తెచ్చుకున్నారు. అదే సమయంలో ఏ పార్టీకీ లభించని మెజారిటీ సాధించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి? మళ్లీ ఈ రేంజ్లో అధికారంలోకి వస్తామా? అనేది చర్చనీ యాంశంగా మారింది.
ఎందుకంటే.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎవరు నిలబడ్డా విజయం దక్కించుకు న్నారు. టీడీపీ కంచుకోటలను కూడా కూలగొట్టారు. అయితే.. పరిస్థితి ఎప్పుడూ..ఒకేలా ఉండదు కదా! అందుకే నేతలు తర్జనన భర్జన పడుతున్నారు. ప్రధానంగా ఇలా ఆలోచిస్తున్నవారిలో రాజన్న రాజ్యం వచ్చిందా? అనేది సందేహంగా ఉంది. నిజమే! ఎందుకంటే.. గత ప్రభుత్వ విధానాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ తప్పు పట్టలేదు. అదే తప్పు పట్టి ఉంటే.. నేడు హైదరాబాద్ ఇలా ఉండేది కాదు.
ఎందుకంటే.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే సహా సైబరాబాద్ నిర్మాణం అంతా.. కూడా చంద్రబాబు హయాంలోనే జరిగింది. అదేవిధంగా అక్కడి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, రహదారుల విస్తరణ వంటివి చంద్రబాబు ప్లాన్ ప్రకారం ఆయన హయాంలో నే జరిగాయి.
అయితే.. ప్రభుత్వం మారిపోయి.. వైఎస్ అధికారంలోకి వచ్చారు. ఆ మాత్రాన ఆయన వాటిని ఎక్కడ అంగుళం కూడా చెదర గొట్టలేదు. అయితే.. రింగ్‌రోడ్డు పరిధిని మార్చుకుని.. కాంగ్రెస్‌కు, తన అనుచరులకు, లేదా కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా చేశారే తప్ప.. పూర్తిగా వాటిని పక్కన పెట్టలేదు.
దీంతో వైఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రైతుల మనసు దోచుకున్నట్టే పెట్టుబడి దారుల మనసు కూడా దోచుకున్నారు. మరి ఇప్పుడు రాజన్న రాజ్యంలో కీలకమైన అమరావతి ప్రాజెక్టును జగన్ పక్క న పెట్టడం తో.. పెట్టుబడులు రావడం లేదు. ఇదే రేపు ఎన్నికల్లో ప్రధాన గుదిబండగా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
దీంతో వారు ఇప్పుడు ఏం చేద్దాం? అనే చర్చ ను తీసుకువస్తున్నారు. ఎందుకంటే. హైకోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. సర్కారు సుప్రీంకు వెళ్తుంది. లేదు.. రైతులకు వ్యతిరేకతంగా వస్తే వారు సుప్రీంకు వెళ్తారు. మరి మన పరిస్థితి ఏంటి? అనేది వారి వాదన.