మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. గుండెపోటు అంటూ కట్టుకథలు అల్లిన వైసీపీ నేతలు చివరకు అది గొడ్డలి పోటు అని తేలడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇక, ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపించడంతో ఆయను కాపాడేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని టాక్ వస్తోంది. అందుకే, ఈ కేసు విచారణను సాగదీస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ పై వివేకా కూతురు సునీతా రెడ్డి కూడా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సీబీఐ అధికారులకు సునీత వాంగ్మూలంలో చెప్పిన మరిన్ని విషయాలు షాకింగ్ గా మారాయి. తన తండ్రిని చంపిన హంతకులను శిక్షించాలని అన్న జగన్ ను సజ్జల, సవాంగ్ ల సమక్షంలో బతిమాలానని సునీత వెల్లడించడం కలకలం రేపింది. ఈసీ గంగిరెడ్డి (వైఎస్ భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరును అనుమానితుల జాబితాలో చేర్చడంపై కూడా జగన్ కోప్పడ్డారని సునీత వాంగ్మూలమిచ్చారు.
వివేకా కేసులో సీబీఐ విచారణ కోరుతూ తాను కోర్టును ఆశ్రయిస్తే జగన్ రాజకీయ భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని సజ్జల వంటి నేతలు తనకు చెప్పారని సునీత గుర్తు చేశారు. తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన అన్న జగన్ సీఎం అయినా విచారణ ఎందుకు ముందుకెళ్లడం లేదో జగన్ నే అడిగితే బాగుంటుందని సునీతా మీడియాకు చెప్పిన విషయం కూడా వైరల్ అయింది. ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి అంతటి వ్యక్తికే ఇలా జరిగితే… సామాన్యుల పరిస్థితి ఏంటి? అని సునీత ప్రశ్నించారు.
సునీత ఈ వ్యాఖ్యలు చేసి చాలా నెలలైంది. అయినా సరే వివేకా మర్డర్ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో సునీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసు విషయంలో న్యాయం చేయాలంటూ సునీత దేశపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ కేసులో సీబీఐ అధికారులు ఏమాత్రం పురోగతి సాధించలేకపోతున్నారని ఆరోపించారు.
ఈ ప్రకారం వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్న ఆమె తన పిటిషన్లో ప్రస్తావించారు. దీంతో, రాఖీ పండుగ నాడే న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ‘అన్న పాలనలో నిజం బయటకు రాదా?’ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. తన అన్న జగన్ పాలనలో తనకు న్యాయం జరగకపోవడంతోనే వైఎస్ సునీత సుప్రీం గడప తొక్కారంటూ విమర్శలు వస్తున్నాయి. రాఖీ పండుగ నాడు జగన్ పరువు తీసిన సునీత అని కామెంట్లు వస్తున్నాయి.
రాఖీ పండుగ నాడే, న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం
అన్న పాలనలో నిజం బయటకు రాదా ?
రాఖీ పండుగ నాడే న్యాయం కోసం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన చెల్లెలు సునీత. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని, తన అన్న పాలన పైనే వైఎస్ సునీత ఫిర్యాదు.
ఇంతకీ #WhoKilledBabai pic.twitter.com/VQKFXHIC4x
— Telugu Desam Party (@JaiTDP) August 12, 2022