ఒక పార్టీ ఉండకూడదు అని అనుకున్న కేసీఆర్ కి ఇపుడు ఎలాంటి కష్టాలు వచ్చాయో చూస్తున్నాం. కేసీఆర్ అనుభవం నుంచి జగన్ గుణపాఠం నేర్చకోవడం లేదు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడం మానేసి వ్యక్తిత్వ హననం ద్వారా ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలని అనుకుంటున్నారు.
పార్టీల్లో ప్రతిపక్షం లాక్కుంటే సరిపోతుందా… ప్రజల్లో ప్రతిపక్షాన్ని నిర్మూలించడం ప్రపంచంలో ఎవరి తరమూ కాదు. నియంతృత్వానికి జీవిత కాలం తక్కువ. పైగా ఇపుడున్న సమాచార వేగంతో అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితి లేదు.
ఇంతకాలం సొంత కారణాలతో భూముల పంపకాన్ని వాయిదా వేసుకున్న ఏపీ సీఎం జగన్ చంద్రబాబు అడ్డుకున్నాడు అంటూ అబద్ధం చెప్పకుంటూ వచ్చారు. ప్రైవేటు వ్యక్తుల భూములు, ఏపీఐఐసీ భూములు, వాగులు, గుడి భూములు తీసుకోవాలన్న ప్రయత్నంలో జగన్ కు కోర్టులు అడ్డుపడితే చంద్రబాబు మీద నింద వేసి తప్పించకునే ప్రయత్నం చేశారు. అయితే, చివరకు అర్థమైంది ఏంటంటే… క్రిస్టమస్ రోజు ఇళ్ల పట్టాలు పంచాలన్న తన కోరిక తీర్చుకోవడంకోసం ఇంతకాలం వాయిదా వేశారు.
ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషను మాత్రం చేయలేదు. ఊరికే నామ్ కే వాస్తే ఈ ఇల్లు నీది అని అధికారులు చెబుతున్నారు అంతే. పైగా ప్రభుత్వ అవసరాలకు ఆ భూమి ఎపుడైనా తిరిగి తీసుకోవచ్చన్న నిబంధన పెట్టారు. ఇంటి పట్టా పంపకం అని పెద్దపెద్ద యాడ్స్ కోట్లు ఖర్చుపెట్టి ఇచ్చి చివరకు డీఫాం చేతిలో పెట్టారు. అంటే డీఫాం కింద ఇల్లు ఇస్తే ఏ యాజమాన్య హక్కు దక్కదు. కేవలం ఆ ఇంట్లో ఉండొచ్చు. రేపు కోర్టుల్లో, రెవెన్యూ కోర్టుల్లో కూడా చెల్లదు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ రివర్స్ అటాక్ చేసేసరికి… కొత్త అబద్ధం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి జగన్.
చంద్రబాబు వల్ల రిజిస్ట్రేషను చేయలేకపోతున్నామని పచ్చి అబద్ధం చెప్పారు జగన్ రెడ్డి. దీనికి ఏ ఆధారం లేదు. కానీ ఇంతవరకు తెలుగుదేశం గాని, తెలుగుదేశం నేతలు గాని ఒక్క చోట కూడా ఇళ్లను ఇవ్వొద్దు అని కోర్టులకు పోలేదు. పైగా పేదలకు రెడీ అయిన ఇళ్లను పంచాలని ధర్నాలు కూడా చేశారు. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి శక్తి మేర అబద్ధాలు చెబుతున్నారు ముఖ్యమంత్రి.