అధికారం ఉన్నంతవరకే రాజకీయ నాయకుల ఆడంబరాలు.. అది పోతే సామాన్య ప్రజల్లో మమేకం అవ్వాల్సిందే. ఈ విషయాన్ని మన మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు, బ్యారికేడ్లు కట్టి ప్రజల్లోకి వెళ్లారాయన. 986 మంది సెక్యూరిటీ సిబ్బంది, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగులకు పైగా ఇనుప ఫెన్సింగ్‌లు, స్పెషల్ ఫ్లైట్లు అబ్బో ఆ రోజులే వేరు.
గత ఐదేళ్లలో ప్రజా సొమ్ముతో జగన్ పోయిన ఆడంబరాలకు హద్దే లేదు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అన్ని ప్రయాణాలకు జగన్ ప్రైవేట్ విమానాలనే వాడేవారు. ఆయన కోసం ఒక ప్రత్యేకమైన విమాన వ్యవస్థే పని చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. చేతిలో పవన్ పోవడంతో జగన్ సామాన్యుడిగా మారారు.
ఈ రోజు సాధారణ ప్యాసింజర్ విమానంలో జగన్ తన భార్య భారతితో కలిసి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి రావాలంటేనే ఇష్టపడని జగన్.. ఇప్పుడు సామాన్య పౌరుడిలా తోటి ప్రయాణికులతో కలిసి వెళ్తుండటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ దృశ్యం అని కొందరు అంటుంటే.. పవర్ ఉండగా ఈ పని చేసుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదుగా అని మరికొందరు జగన్ ను ఎద్దేవ చేస్తున్నారు.