చెల్లెలు షర్మిలతో జగన్ కాళ్ళ బేరానికి వచ్చాడా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గత కొంత కాలం నుంచి జగన్, షర్మిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు నడుస్తున్నాయి. ఆస్తి పంపకాల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో జగన్ కు దూరమైన షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో తెలంగాణలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టారు. ఆపై అన్నను ఓడించడమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ఇటీవల జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకోవడానికి ఒక విధంగా షర్మిల కూడా కారణం అయ్యారు. ఇక సీఎంగా ఉన్న సమయంలో తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ అయిన వారిని కూడా పక్కన పెట్టిన జగన్.. అధికారం కోల్పోయాక వాస్తవాలను తెలుసుకుంటున్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు కోసం అందరినీ కలుపుకుని వెళ్లాలనే ఆలోచనకు వచ్చారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల నడుమ వైసీపీ ఒంటిరిగా బలపడటం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో జతకడితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనలో ఉన్న జగన్.. ఆ దిశగా అడుగులు వేశారు. అయితే ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల ఉండటంతో.. జగన్ కు కాంగ్రెస్ అధిష్టానం కీలక సూచన చేసిందట. కాంగ్రెస్తో కలవాలంటే షర్మిలతో ఉన్న విభేదాలకు పులిస్టాప్ పెట్టాలని అధిష్టానం పెద్దలు చెప్పారట.
ఇక తన పొలిటికల్ ఫ్యూచర్ మరియు పార్టీని మళ్లీ నిలబెట్టడం కోసం జగన్ షర్మిలతో కాళ్ళ బేరానికి వచ్చారట. గతంలో షర్మిలకు ఆస్తి నుంచి చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న జగన్.. ప్రస్తుతం ఆస్తి పంపకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇన్ సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. అంతేకాదు గత కొద్ది రోజుల నుంచి ఆస్తుల పంపకాల విషయంలో బెంగళూరు వేదికగా అన్నా – చెల్లి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మరి జగన్, షర్మిల రాజీతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.