మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో దూకుడు పెంచిన సీబీఐ..వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ని అదుపులోకి తీసుకోవటం ద్వారా.. తర్వాత ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆదివారం తెల్లవారుజామున పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు.. భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఉదయాన్నే మొదలైన ఈ హడావుడి సాయంత్రానికి హైదరాబాద్ లోని చంచలగూడ జైలుకు ఆయన్ను చేర్చటం ద్వారా ఈ కేసుకు సంబంధించిన ఒక కీలక అంకం ముగిసినట్లైంది.
ఉదయాన్నే భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. కుటుంబ సభ్యులకు మెమోను అందజేసి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద అరెస్టు చేయటం.. అదే సమయంలో ఆయన మొబైల్ ను సీజ్ చేయటం చేశారు. సీబీఐ అధికారులు వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న అవినాశ్ రెడ్డి అనుచరులు.. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భాస్కర్ రెడ్డి నివాసం వద్దకు చేరుకోవటం.. అధికారుల వాహనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనటం.. దాన్ని అధిగమిస్తూ.. భాస్కర్ రెడ్డిని అధికారులు హైదరాబాద్ కు తరలించారు.
మరోవైపు పులివెందులలో నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ..ర్యాలీని నిర్వహించారు. అరెస్టు వేళలో హైదరాబాద్ లో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి.. సీబీఐ అధికారులు తన తండ్రిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలిసినంతనే.. ఆయన పులివెందులకు బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్ కు తీసుకొచ్చిన భాస్కర్ రెడ్డిని.. ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయనకు కాస్తంత బీపీ ఎక్కువగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. అనంతరం విజయనగర్ కాలనీలోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్ రెడ్డికి 14 రోజుల పాటు (ఏప్రిల్ 29 వరకు) రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యం గురించి జడ్జికి చెప్పామని.. భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులు మీడియాకు వెళ్లడించారు.
వైద్యుల సర్టిఫికేట్లను జైలు అధికారులకు ఇవ్వాలని.. వాటి ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ను జడ్జి ఆదేశించారు. జడ్జి నివాసం నుంచి భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని తమకు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన కౌంటర్ ను సోమవారం దాఖలు చేయనున్నారు.
సీబీఐ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వైఎస్ భాస్కర్ రెడ్డి పరారీ అయ్యే అవకాశం ఉందని.. అందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈకేసులో కీలక సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివేకాకు భాస్కర్ ఫ్యామిలీకి వివాదం ఉందని.. సీబీఐ అధికారుల రిమాండ్ లో పేర్కొన్నారు. హత్య కేసు విచారణ సందర్భంగా.. తాము అడిగిన ప్రశ్నలకు భాస్కర్ రెడ్డి సమాధానాలు అన్నీ కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొనటం గమనార్హం. చంచలగూడ జైలుకు చేరిన భాస్కర్ రెడ్డిని.. జైలు ఆవరణలోని ఆసుపత్రిలో ఆయనకు వసతి కల్పించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
నారాసుర రక్తచరిత్ర అని తప్పుడు రాతలు రాసిన సాక్షి, రేపు భాస్కర్ రెడ్డి అరెస్టు గురించి సాక్షి ఫ్రంట్ పేజ్ లో రాయాలి – యరపతినేని శ్రీనివాసరావు pic.twitter.com/qbjtoFKDDr
— I Love India✌ (@Iloveindia_007) April 16, 2023
అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి చిన్న చేపలు మాత్రమే, పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయి
వాళ్ళు అరెస్టు అయినందుకు ఆనంద పడడం లేదు.. పులివెందులలో టిడిపి జెండా ఎగరేసి అప్పుడు ఆనందిస్తా : బిటెక్ రవి pic.twitter.com/Guu21wPsB5
— TDP Germany (@TDP_Germany) April 16, 2023