వైసీపీలో ఇదొక సంచలన చర్చ! గత నాలుగు రోజులుగా తాడేపల్లి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన వ్యవ హారం కూడా! ప్రస్తుతం విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తోంది. దీంతో గత వారం రోజులుగా మీడియా అంతా కూడా అక్కడే కాన్సన్ట్రేట్ చేసింది. ఇదే అదునుగా వైసీపీలో కీలక అంశంపై నేతలు దృష్టి పెట్టారని తెలిసింది. అది కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంపై కావడం గమనా ర్హం.
తాడేపల్లి పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంలో ఒక కీలక సలహాదారు వరుసగా రెండు రోజుల పాటు.. ఉదయాన్నే వచ్చి పరిస్థితిని తెలుసుకుని వెళ్తున్నారని తెలిసింది. ఈ విషయంపైనే తాడేపల్లి వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. వైసీపీ నేతల కథనం మేరకు.. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ సతీమణి భారతి.. మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
వాస్తవానికివచ్చే ఎన్నికల్లో భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమనే వాదన కొన్నాళ్లుగా వినిపి స్తూనే ఉంది. అయితే.. అందరి దృష్టి కూడా కడపపైనే ఉంది. రాజంపేట నుంచి భారతిని నిలబెట్టి గెలి పించుకుంటారనే భావనలో ఉన్నారు. ఎలానూ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని పార్టీ పూర్తిగా పక్కన పెట్టింది. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని.. అనుకూల మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
దీంతో భారతికి రాజంపేట టికెట్ కన్ఫర్మ్ అయిందని..కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు వ్యూహం మార్చుకుని.. మంగళగిరి వైపు భారతి వస్తున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మంగళగిరిలో భారతి విజయం ద్వారా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రధానంగా రాజధాని విషయంలో వైసీపి అనుసరిస్తున్న విధానానికి ఇక్కడి ప్రజలు ఆమోద ముద్రవేసినట్టుగా ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. భావిస్తున్నారు. భారతి విజయం నల్లేరుపైనడక అయ్యేలా.. ఇక్కడి కీలక నేతలకు బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.