అవును..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ చెప్పినట్లుగానే ఎన్నికల బరిలో వైసీపీని ఓడించేందుకు దిగబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం బరిలో నిలిచి..రండి అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. పాలకొల్లు సభలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న 24 గంటల్లోనే రఘురామకు ఉండి టికెట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉండికి రండి తేల్చుకుందాం అంటూ వైసీపీ అధినేత జగన్ కు రఘురామ ఛాలెంజ్ చేస్తున్నారు.
అంతకుముందు, పాలకొల్లులో చంద్రబాబుపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను కస్టోడియల్ టార్చర్ కు గురవుతున్నపుడు చంద్రబాబు తనకు ధైర్యం చెప్పారని, తన కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు రుణపడి ఉంటానని అన్నారు. 2024 జూన్ 4న మోడీ, చంద్రబాబు, పవన్..త్రిమూర్తులు విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. తనకు ఇన్నాళ్లు అండగా నిలిచిన బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.