ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా విశాఖ జిల్లా చుట్టూనే తిరుగుతోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాదని విశాఖను పాలనా రాజధాని చేస్తామంటూ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు అంతా కంకణం కట్టుకుని కూర్చున్నారు. అయితే, విశాఖలో రుషికొండతో పాటు దసపల్ల వంటి కొన్ని విలువైన భూములను ఆక్రమించుకొని భూధందా చేసేందుకే వైసిపి నేతలు విశాఖను టార్గెట్ చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే విశాఖలోని భూములను, స్థలాలను కబ్జా చేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేశారని విమర్శలు వస్తున్నాయి. వైసిపి నేతల భూధందాకు భయపడి దశాబ్దాల నుంచి తమ భూములను, స్థలాలను కాపాడుకుంటున్న యజమానులు…. వైసీపీకి చెందిన డెవలపర్లకు కారు చౌకగా భూములు విక్రయించడం సంచలనం రేపుతోంది. అయితే, ఆ డెవలపర్లంతా వైసీపీ నాయకులు, వారి సన్నిహితులు కావడం విశేషం.
మొత్తం భూమి, మొత్తం స్థలం తీసుకొని 20 లేదా 30 శాతం వాటా ఇస్తే చాలని….కనీసం ఒక శాతం వాటా ఇచ్చిన మహాభాగ్యం అంటూ భూములను వైసీపీ నేతల అనుయాయులకు స్థలం యజమానులు ఇచ్చేయడం విశేషం. విశాఖ నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన దసపుల్ల భూముల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. దశపల్లా భూములలో అత్యంత ఖరీదైన 15 ఎకరాలను వాటి యజమానులు అని చెప్పుకుంటున్న 64 మంది కారుచౌకకు అమ్మడం విశేషం.
మా భూమి మీరే కొనండి మాకు ఈరోజు 29% వాటా ఇస్తే చాలు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడికి చెందిన కంపెనీకి వారు అమ్మేసి చేతులెత్తేసారంటే వారిని వైసీపీ నేతలు ఏ రేంజ్ లో భయపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పోల్చుకుంటే విజయసాయిరెడ్డి అన్యాయాలు చాలా నయమని చెప్పుకోవచ్చు. కేవలం 0.96% వాటా ఇచ్చి తాను 99.04% వాటా తీసుకునేలా గతంలో ఎంవీవీ కుదుర్చుకున్న ఒప్పందం ఒకటి ఇప్పుడు బట్టబయలైంది.
ఇక బయటపడ్డ లావాదేవీలు ఈ రేంజ్ లో ఉంటే బయటకు రాని చెప్పుకోలేని లావాదేవీలు ఎన్ని ఉన్నాయో అంటూ విమర్శలు వస్తున్నాయి. భూమి విలువతో కలిపి ఎంవివి డీల్ చేసిన ఆ ప్రాజెక్టు విలువ 159.5 కోట్లు అని. అంతటి భారీ ప్రాజెక్టులో కేవలం 0.96% వాటాకు యజమానులు ఒప్పుకుంటారా అని చిన్నపిల్లవాడిని అడిగినా సరే ఒప్పుకోరు అనే సమాధానం వస్తుంది. మరి, ఇంత భారీ డీల్ ను ఇలా సెట్ చేశారంటే కచ్చితంగా యజమానులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏది ఏమైనా విశాఖ తీరంలో వైసిపి ఎంపీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.