అమరావతి పాదయాత్రపై మరో వైసీపీ ఎమ్మెల్యే విషం కక్కారు.
అరసవిల్లి దేవాలయానికి వెళ్లాలంటే బస్సులోనో, రైల్లోనో, కార్లోనో వెళ్లాలి గాని పాదయాత్రగా వెళ్తారా అంటూ విచిత్రమైన వాదన లేవదీశారు.
ప్రశాంతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై విచిత్రమైన విమర్శలు చేశాడు.
‘‘గొడవలు సృష్టించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదు‘‘ అని అక్కసుతో వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీరామారావు తెలుగువారి గుండెల్లో ఉన్న మాట నిజమే కానీ, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు అయ్యన్నకు లేదన్నారు. రైతుల పాదయాత్రకు ఆయన అండగా వస్తే అక్కడే అయ్యన్న పాత్రుడిని తొక్కేస్తానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హెచ్చరించారు.
అయితే, ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రైతులు కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే ఎమ్మెల్యేకు ఎందుకు అంత నొప్పో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు.
గుడివాడలో అమరావతి రైతన్న పాదయాత్ర.. pic.twitter.com/Qi4V1mhfeo
— iTDP Official (@iTDP_Official) September 24, 2022
చీమలు పెట్టుకున్న పుట్టలో పాములు దూరినట్లు, అమరావతికి భూములిచ్చిన రైతులు, న్యాయం కోసం పాదయాత్ర చేస్తుంటే వైసీపీ వెధవలు పెయిడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి రైతులు ఇచ్చిన భూముల్లోనే టెంట్లు పాతి, 3 రాజధానులకు అనుకూలంగా మీడియాకు ప్రజలకు ఎలా అబద్ధాలు చెప్పాలి అంటూ శిక్షణ ఇస్తున్నారు. pic.twitter.com/EFLYp4d8ya
— Telugu Desam Party (@JaiTDP) September 25, 2022