వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ ప్రజల్లో ఉండాలని అంటారు.. ఆయన చెప్పిన మాట.. చేస్తున్న హెచ్చరికలు (టికెట్ ఇవ్వడంపై).. కారణం ఏదైనా.. నేతలు ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ, ఎప్పటికప్పుడు.. ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు అవుతూనే ఉన్నాయి. మంత్రులు అని కూడా చూడకుండా ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. వారికి సమాధానం చెప్పలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే వెనుదిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రధానంగా ఉమ్మడి కృష్నా, గుంటూరు జిల్లాల్లో అయితే.. రాజధానిపై ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతు న్నాయి. తాజాగా.. కీలకమైన ఎస్సీ నియోజకవర్గం నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు.. `గడపగడపకు మన ప్రభుత్వం` కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను రాజధానిపై నిలదీశారు. కొడవటికల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇంటి యజమానికి, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
యజమాని: మన రాజధాని ఏది సర్?
ఎమ్మెల్యే: మన రాజధాని ఒకటి కాదు మూడు కదా ! మీకు తెలియదా?
యజమాని: నాకు తెలియదు సర్ అందుకే అడిగా
ఎమ్మెల్యే: తెలియకపోతే వదిలేసేయండి వాదన మాత్రం చేయొద్దు
యజమాని: ఒకే రాజధాని ఉంటుందని ఎన్నికలకు ముందు చెప్పారు. దీంతో మేం ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు ఇదే పాలన సర్
ఎమ్మెల్యే: ఎక్కువతక్కువ మాటలు వద్దు.
యజమాని: సుబాబుల్ మద్దతు ధర కల్పిస్తామని పాదయాత్ర చేశారు కదా ఏమైంది
ఎమ్మెల్యే: మీరు అసలు ఓటు వేశారా
యజమాని: ఏం.. వేయకపోతే మా దగ్గరికి ఎందుకు వచ్చావు
కొసమెరుపు.. వాగ్వాదం పెరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువుని పంపించి వేశారు.
మన రాజధాని ఏది సర్? వైసీపీ ఎమ్మెల్యేకు షాక్..!#YSRCPMLA #AndhraPradesh #ApCapital #AmaravatiCapital #VizagCapital #YSRCP #cmjagan #ysrcp #metanewstelugu pic.twitter.com/MIFhL4dmtz
— Meta News Telugu Live (@metanewstelugu) April 14, 2023