జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మరిన్ని మాటల తూటాలు పేల్చింది. ఈ సారి అన్ని సరిహద్దు లు అత్యంత దారుణంగా వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. నువ్వొక సంస్కార హీనుడువి జగన్.. అంటూ కొన్నాళ్ల కిందట పవన్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. దీనికి తాజాగా కౌంటర్ ఇచ్చిన వైసీపీ.. పవన్‌పై వ్యక్తిగత విమర్శలను మరింత పెంచింది. అత్యంత దారుణమైన వ్యాఖ్యలతో పవన్‌ను కార్నర్ చేసింది.
“పవన్ నువ్వొక సంస్కారవంతుడివి. ఎంత సంస్కారం అంటే.. ఒక భార్యను పెళ్లిచేసుకుని మరో మహిళతో బిడ్డను కనేంత!. అక్కడితో సరిపెట్టావా? ఇద్దరికీ విడాకులు ఇచ్చి మరో మహిళను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇక్కడితో నైనా సరిపెట్టావా అంటే.. అదీ డౌటే!“ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య వాద వివాదాలు, వ్యాఖ్యలు కామనే. కానీ, ఇలా అత్యంత దారుణంగా సొంత వ్యవహారాలను కూడా రోడ్డుకు లాగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఇదిలావుంటే.. మూడు రోజుల కిందట సీఎం జగన్‌కూడా కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. గతానికి భిన్నంగా పవన్‌పై విమర్శలు గుప్పించారు. గుండుగుత్తగాపవన్ అభిమానులను, పార్టీ కార్యకర్తలను కూడాఅమ్మేసేందుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. పవన్ విషయంలో వైసీపీ ఎంతగా భయపడుతోందో అర్థమవుతోందని జనసేన అభిమానులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.