జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర సర్కారుకు చెమటలు పట్టిస్తోందా? పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ నాయకులకు టెన్షన్ పట్టుకుందని.. ఇప్పటి వరకు వారు ఏం చేసినా .. తమను ప్రశ్నించేవారు లేరనే ధోరణితో ఉన్నారని ఇప్పుడు ఆ భావనకు పవన్ చెక్ పెడుతున్నారని అంటున్నారు నాయకులు. ఇప్పటి వరకు రెండు సార్లు వారాహి యాత్రలు చేసిన పవన్.. వైసీపీ నేతలకు అనేక సవాళ్లు రువ్వారు.
దీంతో వైసీపీ నాయకులు ఉలిక్కి పడ్డారన్నది జనసేన నాయకుల టాక్. ఇక, ఇప్పుడు వారాహి 3.0 కూడా వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతోందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలోనూ.. అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలోనూ జనసేనాని దూకుడు సఫలీకృతం అవు తోందని చెబుతున్నారు. ప్రధానంగా ప్రజల్లోనూ ఆలోచన రేకెత్తిస్తున్నారని.. ఇది తమకు మైలేజీ పెంచు తుందని అంచనా వేస్తున్నారు.
ఇంకోవైపు.. జనసేన పార్టీ దూకుడు కారణంగా.. పార్టీ పరంగా కూడా దూకుడు పెరిగిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని పక్కన పెడితే.. పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు అవ కాశం ఏర్పడిందని.. పార్టీపై ప్రజల్లోనూ సదభిప్రాయం ఏర్పడిందని అంటున్నారు. అదేవిధంగా సర్కారు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులు చేస్తున్న దానికి మధ్య తేడాను కూడా జనసేనాని వివరించి చెబుతుండడంతో ఆలోచనాత్మకంగా ఉందని అంటున్నారు.
దీంతో పార్టీ పరంగావారాహి దూకుడు బాగుందని.. అదేసమయంలో వైసీపీ నాయకులకు, ప్రభుత్వానికి కూడా చెమటలు పడుతున్నాయని మెజారిటీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే పరిణామం.. మరో మూడు మాసాలు కనుక ముందుకు సాగితే.. పార్టీ విజయం తథ్యమని జనసేన పార్టీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉందని కూడా చెబుతున్నారు.